International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా డే జూన్ 21 నే ఎందుకు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?

International Yoga Day 2022: రేపు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది 'మానవత్వం కోసం యోగా' అనే థీమ్‌పై వేడుకలు నిర్వహించనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 07:03 PM IST
International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా డే జూన్ 21 నే ఎందుకు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?

International Yoga Day 2022 Significance: ప్రతి సంవత్సరం జూన్ 21న, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం 'మానవత్వం కోసం యోగా' (Yoga for Humanity) అనే థీమ్‌పై వరల్డ్ వైడ్ గా యోగా వేడుకలు జరుగనున్నాయి. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే (International Yoga Day 2022) ముఖ్య ఉద్దేశ్యం. ఏడాదిలో సుదీర్ఘకాలం పగటి సమయం ఉండే రోజు జూన్ 21. అందుకే జూన్ 21న యోగా డే నిర్వహిస్తారు. 

యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం. 'యోగ' అనే పదం సంస్కృతం నుండి పుట్టింది. నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉంది. 177 దేశాల మద్దతుతో భారతదేశం చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ప్రకటించింది. పతంజలిని యోగా పితామహుడిగా భావిస్తారు. యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పించింది మాత్రం బి.కె.ఎస్ అయ్యంగార్ అనే చెప్పాలి. ఈయన యోగాపై ఎన్నో పుస్తకాలు రాసారు. 

Also Read: Mangal Gochar 2022: మరో 7 రోజుల్లో రాశిని మార్చబోతున్న కుజుడు... ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News