Horoscope Today September 2nd 2022: నేటి రాశి ఫలాలు... ఈ రెండు రాశుల వారిని ఇవాళ అసంతృప్తి వెంటాడుతుంది

Horoscope Today September 2nd 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. 108 సార్లు లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తూ పూజించినట్లయితే ఆ దేవత అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2022, 06:52 AM IST
  • ఇవాళ శుక్రవారం.. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు
    108 సార్లు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠిస్తే శుభం కలుగుతుంది
    నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today September 2nd 2022: నేటి రాశి ఫలాలు... ఈ రెండు రాశుల వారిని ఇవాళ అసంతృప్తి వెంటాడుతుంది

Horoscope Today September 2nd 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. 108 సార్లు లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తూ పూజించినట్లయితే ఆ దేవత అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. మరి ఈ శుక్రవారం ఆ దైవ అనుగ్రహం ఎవరిపై ఉంది, ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

మేష రాశి (Aries)

ఇవాళంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పార్ట్‌నర్‌షిప్‌తో కొత్త బిజినెస్ మొదలుపెట్టే అవకాశం ఉంది.  సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ రిలేషన్‌షిప్‌లో ఒకరి పట్ల ఒకరికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా, సాఫీగా సాగుతుంది. ఇంటి కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీ పనిలో బాగా రాణిస్తారు. మీ బాస్‌తో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వృత్తి రీత్యా కొత్త బాధ్యతలు మీద పడుతాయి. పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఇవాళ ఉపశమనం కలుగుతుంది. స్థిరాస్తి సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరికే అవకాశం ఉంది.

మిథున రాశి (GEMINI)

పిల్లల చదువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఇవాళ బిజీగా గడుపుతారు. విద్యార్థులు మరింత అప్‌డేట్ అయ్యేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యకు ప్లాన్ చేసుకుంటారు. వివాహితులకు సంతానపరంగా శుభవార్త ఉండే అవకాశం ఉంది. బ్యాచిలర్స్‌ తమ సోల్‌మేట్‌ను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. విద్యా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ అసంతృప్తి వెంటాడుతుంది. చేపట్టిన పనులపై ఏకాగ్రత కుదరదు. బాధ్యతలను విస్మరిస్తారు. పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలు తీసుకొస్తాయి. వ్యాపార లేదా స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి కొత్తగా ఏ ఒప్పందం చేసుకున్నా డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా చదవాలి. పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటి పునర్నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉంటారు. 

సింహ రాశి (LEO)

వివాదాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అంతా మళ్లీ ఎప్పటిలాగే కలిసిపోతారు. దీంతో మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఇవాళ మీ అంతరంగీక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కఠినమైన పనులను సైతం సకాలంలో పూర్తి చేయడంలో అది మీకు దోహదపడుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తి ఒకరు మీ సాయం కోరుతారు. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఆ వ్యక్తికి కాస్త చేయూతనిస్తారు.

కన్య రాశి (Virgo)

ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో బిజీగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదపూర్వకంగా మెలుగుతారు. బంధువుల్లో, కుటుంబ సభ్యుల్లో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంటి కోసం ఇవాళ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ దగ్గరి బంధువుల నుంచి గుడ్ న్యూస్ అందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 

తులా రాశి (Libra)

పెద్దల ఆశీస్సులతో మీకు అంతా మంచే జరుగుతుంది. మునుపటికన్నా ఓపికగా పనులను చక్కబెట్టుకుంటారు. చేపట్టిన పనిపై పూర్తి ఫోకస్ పెడుతారు. లక్ష్యాలను అందుకోవడంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేస్తారు. ఖర్చులు, ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. సేవింగ్స్ పెరుగుతాయి. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే మీలోని పాజిటివ్స్, నెగటివ్స్‌పై క్లారిటీ వస్తుంది. అది మిమ్మల్ని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా చేస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ చాలా అసంతృప్తితో ఉంటారు. మనసంతా తెలియని అసంతృప్తి వెంటాడుతుంది. బద్దకంగా, నిరాశ నిస్పృహలతో ఉంటారు. మీరు చేపట్టిన పనులపై ఆ ప్రభావం ఉంటుంది. మునుపటికన్నా వేగం తగ్గుతుంది. ప్రేమికులు పెళ్లికి సంబంధించిన నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి డిసప్పాయింట్‌మెంట్ తప్పకపోవచ్చు.

ధనుస్సు రాశి (Sagittarius)  

మీలోని అంతరంగీక శక్తి మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో, సంతోషంతో ఉండేలా చేస్తుంది. పెట్టుబడులు పెట్టేవారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అన్నివిధాలా సహాయ సహకారాలు లభిస్తాయి. మునుపటి కన్నా మెరుగైన పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకునేందుకు బాగానే కష్టపడుతారు. ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి.

మకర రాశి (Capricorn) 

చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. ఇన్నాళ్ల మీ కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు వచ్చినట్లే. ఉన్నతమైన స్థానానికి చేరే అవకాశం ఉంది. ప్రభావశీలురైన వ్యక్తులతో సంభాషణలు మీపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. ఆ మాటలు మిమ్మల్ని వెంటాడుతాయి. కొన్ని విషయాల్లో అవి మీ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేస్తాయి. కుటుంబ సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. 

కుంభ రాశి (Aquarius)

ఇవాళంతా సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత, దైవ చింతన మిమ్మల్ని మరింత ధృఢంగా మారుస్తుంది. సేవా సంస్థలకు లేదా ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల కోసం దాన ధర్మాలు చేస్తారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. బ్యాచిలర్స్‌కి తగిన జోడీ దొరకవచ్చు.

మీన రాశి (Pisces) 

ఇవాళ ఒంటరితనం వెంటాడుతుంది. మిమ్మల్ని మీరు అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ రీత్యా బాధ్యతల విషయంలో మార్పు ఉండొచ్చు. మీ సహనాన్ని పరీక్షించే సందర్భాలు ఎదురవుతాయి. మీలోని అహంకారం తొలగిపోతుంది. అడ్వెంచర్ టూర్‌కి వెళ్లాలనుకుంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Disha Patani Images: అయ్య బాబోయ్ దిశా పటాని.. ఈ హాట్ అందాలు ఎప్పుడూ చూసుండరు

Also ReadSunny Leone Hot Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News