Shani Dev Remedies: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇందుకు అనుగుణంగానే గ్రహాలు, రాశులు, శని దేవుడి ప్రస్తావన ఉంది. శని ఆగ్రహం లేదా శనిదోషం నుంచి విముక్తి పొందే మార్గాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
శని వక్రదృష్టి మనిషిని నాశనం చేస్తుందంటారు. అదే సమయంలో శని కటాక్షం ఉంటే రాజభోగం కలుగుతందని చెబుతారు. శని మహాదశ, శని దోషం, శని వక్ర దృష్టి ఉన్నప్పుడు ఆ జాతకులు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటి కారణంగా శని దేవుడు ప్రసన్నుడై..జీవితంలో కష్టాల్ని తొలగిస్తాడని విశ్వాసం.
వ్యాపారంలో నష్టాల్ని దూరం చేసేందుకు శని దేవుడి మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించాలి. మంత్రాలు పఠిస్తున్నప్పుడు మినుములు కొద్దిగా చెంతన ఉంచుకోవాలి. వాటిని శనిదేవుడికి అర్పిస్తుండాలి. ఆ తరువాత వాటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి. వ్యాపారం వృద్ధిలో రావడమే కాకుండా అన్ని బాధలు దూరమౌతాయి.
కోర్టు వ్యవహారాలున్నప్పుడు ..అవి పరిష్కారం కాలేకపోతే..కోర్టుకు వెళ్లేటప్పుడు శనిదేవుడి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. దీంతో త్వరగానే విజయం లభిస్తుంది.
అదే సమయంలో చెడు దృష్టి ఉన్నా..అభివృద్ధి కాలేరు. ధననష్టం జరుగుతుంటే..ఉదయం స్నానం చేసిన తరువాత శనీశ్వర మంత్రాన్ని 31 సార్లు జపించాలి. ఆ తరువాత నీలిరంగు పూవుని డ్రైనేజ్‌లో పారేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం కలగడమే కాకుండా..అభివృద్ధి పధాన పయనిస్తారు.
జీవితంలో సమస్యలు ఒకదానివెంబడి మరొకటి పీడిస్తుంటే..శనిదేవుడికి ధ్యానం చేయాలి. దీనికోసం చిన్న గిన్నెలో ఆవనూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. ఆ తరువాత ఆ నూనెను గిన్నెతో సహా...శనిదేవుడి మందిరంలో ఉంచాలి.
రోజూ ఆఫీసుకు వెళ్లేముందు శనీశ్వర మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలుంటాయి. అటు ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది. ప్రతి శనివారం నాడు శనీశ్వర మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Also read: Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook