Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఒంటి నిండా బంగారం వేసుకుని వర్కౌట్స్ చేస్తు రెచ్చిపోయిన యువతి .. వీడియో వైరల్..

Bride body building video: యువతి ఒంటి నిండా బంగారం వేసుకుని బాడీ బిల్డింగ్ చేస్తు హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. నెటిజన్ లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 23, 2025, 02:32 PM IST
  • జిమ్ లో రెచ్చిపోయిన యువతి..
  • షాక్ అవుతున్న నెటిజన్ లు..
Viral Video: ఇదెక్కడి విడ్డూరం..  ఒంటి నిండా బంగారం వేసుకుని వర్కౌట్స్ చేస్తు రెచ్చిపోయిన యువతి .. వీడియో వైరల్..

Girl workouts video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు  అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా నెటిజన్లు వెరైటీగా ఉన్న వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. మరీ కావాలని చేస్తారో లేదా పబ్లిసిటీ కోసం తాపత్రం పడుతారో కానీ.. మొత్తంగా పెళ్లికి సంబంందించిన వీడియోలు ఏదో ఒక నవ్వుతెప్పించే అంశంతో వార్తలలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వధువు ఒంటినిండా బంగారం వేసుకుని మరీ వర్కౌట్స్ చేస్తుంది.

 

మరీ ఆమె తన పెళ్లి కోసం ఫోటో షూట్ చేస్తుందో ఏంటో లేదా అత్తింటి వాళ్లను భయపెట్టాలని ఇలా వీడియోలు తీస్తుందో కానీ.. మొత్తంగా ఆమె ఒంటి నిండా బంగారం వేసుకుని మరీ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

ఈ వీడియోలో యువతి అందంగా బంగారం వేసుకుని రెడీ అయ్యింది. కానీ ఎవరైన కొత్త పెళ్లి కూతురు బంగారం వేసుకుని ఫోటో షూట్ లు, రీల్స్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఈ యువతి మాత్రం.. తన బాడీ బిల్డింగ్ చూయిస్తు.. అదేదో జిమ్ పోటీల ఆడిషన్ లకు ఫోటోలు పంపినట్లు వీడియోలు చేస్తు రచ్చ చేసింది.

ఆమె రకరకాల భంగీమల్లీ తన బాడీని చూపిస్తు.. అందర్ని షాక్ కు గురిచేసింది. ఆమె జిమ్ లో వర్కౌట్ స్టిల్స్ చూని నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇలాంటి ఫోటోలు, వీడియోలను చూస్తే.. కోడలుగా చేసుకునేందుకు భయపడిపోతారని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Read more:Viral Video: వామ్మో.. దట్టమైన అడవిలో గుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న సింహలు.. షాకింగ్ వీడియో వైరల్..

మరికొందరు మాత్రం... బాబోయ్.. ఆమెకు కోపం వస్తే.. చెంక కింద అత్తింటి వాళ్లను పిసికేసేలా ఉందని కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా యువతి బాడీ బిల్డింగ్ వీడియో  నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News