Year Ender 2024: ఈ యేడాది బ్లాక్ బస్టర్ కాకుండా జస్ట్ హిట్ అనిపించుకున్న సినిమాలు..


Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి. 

1 /8

Year Ender 2024: ఈ యేడాది మొదట్లో సంక్రాంతికి విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అటు నాగార్జున ‘ నా సామి రంగ’ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. దీంతో పాటు గామి, ఓం భీమ్ బుష్ సినిమాలు ఓ మోస్తరు విజయం సాధిస్తాయి.  

2 /8

నా సామి రంగ.. నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా తెరకెక్కిన  సినిమా ‘నా సామి రంగ’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.

3 /8

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

4 /8

గామి.. విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా ‘గామి’. మహా శివరాత్రి కానుకగా విడుదైల ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.

5 /8

ఓం భీమ్ బుష్.. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. సైన్స్ ఫిక్షన్ కమ్ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది.

6 /8

మనమే .. శర్వానంద్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. ఈ సినిమా యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.

7 /8

35.. నివేదా థామస్ హీరోయిన్ గా ముఖ్యపాత్రలో ప్రియదర్శి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘35’. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలను అందుకుంది.

8 /8

అటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, ఊరి పేరు భైరవ కోన, జీబ్రా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాలను అందుకోవడం విశేషం.