Turkey gold mines: బయటపడిన అతి పెద్ద బంగారు నిధి.. దీని విలువ ఎంతో తెలుసా ?

Largest gold mines discovered in Turkey: టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది. ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టర్కీకి చెందిన మీడియా సంస్థ అనాడోలు ఈ వార్తను ధృవీకరించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకోకుండా బంగారు నిధులు బయపడుతుంటాయి.

  • Dec 24, 2020, 19:31 PM IST

Largest gold mines discovered in Turkey: టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది. ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టర్కీకి చెందిన మీడియా సంస్థ అనాడోలు ఈ వార్తను ధృవీకరించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకోకుండా బంగారు నిధులు బయపడుతుంటాయి. కానీ ఇది అలాంటి ఇలాంటి బంగారు నిధి కాదు... ఈ బంగారు నిధి విలువ అనేక దేశాల జిడిపి కంటే ఎక్కువ విలువైంది. ఈ బంగారు నిధి విలువ 6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో రూ .44,000 కోట్లు అన్నమాట.

1 /6

వరల్డ్‌మీటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్దీవుల జిడిపి 4.87 బిలియన్ డాలర్లు, లిబేరియా జీడీపీ 3.29 బిలియన్ డాలర్లు, భూటాన్ 2.53 బిలియన్ డాలర్లు, బురుండి 3.17 బిలియన్ డాలర్లు, లెసోతో 2.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 

2 /6

ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు టర్కీలో లభించే నిధి కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా, మౌరిటానియా, మోంటెనెగ్రో, బార్బడోస్, గయానా, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా టర్కీలో బయటపడిన బంగారు నిధి కంటే చిన్నవే కావడం గమనార్హం.

3 /6

ఈ నిధి టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో కనుగొన్నారు. టర్కీ గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ ( Turkey Gubretas Fertiliser ) వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ చీఫ్ అయిన ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. బంగారు నిధి విలువ ( Turkey gold mines value ) సుమారు 6 బిలియన్ డాలర్లు ఉంటుందని పోయరాజ్ టర్కీ వార్తా సంస్థకు తెలిపారు.

4 /6

సెప్టెంబర్‌లో, టర్కీ ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ 38 టన్నుల బంగారం ఉత్పత్తితో దేశం పెద్ద రికార్డును బద్దలు కొట్టిందని అన్నారు. రాబోయే ఐదేళ్లకు తన లక్ష్యం వార్షిక బంగారు ఉత్పత్తిని 100 టన్నులకు పెంచడమేనని ఆయన చెప్పారు.

5 /6

రాబోయే రెండేళ్లలో ఈ బంగారం తవ్వడం జరుగుతుందని. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుందని పోయరాజ్ అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తిదారుడు 2019లో మరో సంస్థతో కలిసి ఈ సైట్‌ను సొంతం చేసుకున్నారని ఆయన చెప్పారు.