భవిష్యత్తులో నీళ్లు సైతం కొనుక్కుంటారని అపుడెపుడో పోతులూరి బ్రహ్మం గారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. కానీ ఒక్కో వాటర్ బాటిల్ 50 లక్షలు కూడా పలుకుతుందని బహుశా అప్పుడు బ్రహ్మం గారు కాదు కదా ఎవరూ ఊహించి ఉండరేమో.
Most Expensive Water Bottle: భవిష్యత్తులో నీళ్లు సైతం కొనుక్కుంటారని అపుడెపుడో పోతులూరి బ్రహ్మం గారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. కానీ ఒక్కో వాటర్ బాటిల్ 50 లక్షలు కూడా పలుకుతుందని బహుశా అప్పుడు బ్రహ్మం గారు కాదు కదా ఎవరూ ఊహించి ఉండరేమో.
ఎలాంటి కాలుష్యం, మలినాలు లేని ఈ నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. దాంతో ఈ నీళ్లు తాగిన వెంటనే శక్తి లభిస్తుంది. ఈ నీటి బాటిల్ మూతలకు వజ్రాలు పొదుగుతారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్ల బ్రాండ్ గా పేరు గాంచింది బెవర్లీ హిల్స్ 90 హెచ్ 2ఓ. ఈ నీళ్లను ఖనిజాలు అధికంగా ఉండే కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి బుగ్గల నుంచి సేకరిస్తారు.
ఈ బాటిల్ లో వాడే నీళ్లను ఐస్ ల్యాండ్, ఫిజి, ఫ్రాన్స్ లోని గ్లేసియర్స్ నుంచి సేకరించి శుద్ధి చేస్తారు అత్యంత కాలుష్య రహితంగా ఉంటాయి. ఇంటులో ఆల్కలీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి.
పేరు పలకడానికే కష్టంగా ఉన్న ఈ వాటర్ బాటిల్ ధర ఏకంగా 50 లక్షల రూపాయలు. ఎందుకింత ధరని ఆశ్చర్యపోవద్దు. ఈ బాటిల్ మేలిమి బంగారంతో తయారు చేశారు. నీళ్లలో కూడా 5 గ్రాముల లిక్విడ్ పసిడి ఉంటుంది.
ఏంటని ఆశ్చర్యపోవద్దు. ఇది ముమ్మాటికీ నిజం. కేవలం ఒక్క వాటల్ బాటిల్ ఖరీదు అక్షరాలా 50 లక్షల రూపాయలు. ఈ వాటర్ బాటిల్ పేరు ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాస్. పేరు ఎంత గమ్మత్తుగా ఉందో..ధర అంతలా ఆకాశాన్నంటుతోంది.అంత 50 లక్షలు పలికేంతగా ఓ వాటర్ బాటిల్ లో ఏముందో అర్ధం కావడం లేదా...ఆ వివరాలు మీ కోసం..