Parliament Canteen: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు క్యాంటీన్‌లోనే ఎంపీల భోజనం చేస్తున్నారు. అయితే పార్లమెంట్ క్యాంటీన్‌లో ఫుల్ మీల్ తింటే ఎంత రేటు ఉంటుందో తెలుసా? పార్లమెంట్ హౌస్‌లో రోటీకి ఎంత ఖర్చవుతుంది? పార్లమెంట్ హౌస్ క్యాంటీన్ కాలంతో పాటు ధరలు కూడా మారాయి. ఒక్కప్పుడు క్యాంటిన్ లో ఫుల్ మీల్ 50పైసలు ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలుసా?
Parliament Canteen: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి సెషన్‌లోనూ అధికారం పక్షంతోపాటు విపక్షాల హంగామా కనిపిస్తోంది. అయితే పార్లమెంటుకు వచ్చే ఎంపీలు, జర్నలిస్టులు, ఇతరుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పార్లమెంటులో క్యాంటీన్ కూడా ఉంటుందన్నసంగతి అందరికీ తెలిసిందే. ఈ క్యాంటిన్ లో నార్త్, సౌత్ అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. వెజ్ తోపాటు నాన్ వెజ్, బిర్యానీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వెజ్ థాలీ ఖరీదు ఎంతో తెలుసా? చపాతీ లేదా రోటీ ధర ఎంతో తెలుసా?
గత 70 ఏళ్లలో ఈ క్యాంటీన్ చాలా మారిపోయిందని చెబుతుంటారు. ప్రస్తుతం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. పార్లమెంటు కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. పార్లమెంట్ తోపాటు క్యాంటీన్‌నుకూడా మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. క్యాంటీన్ ఆహార జాబితాలో మిల్లెట్ వంటకాలు కూడా చేర్చారు. ఇంతకు ముందు ఈ క్యాంటీన్‌లో తక్కువ ధరకే ఆహారం లభించేది. కానీ ఇప్పుడు ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఇతర హోటళ్లతో పోలిస్తే, సంసద్ భవన్ క్యాంటీన్ ఇప్పటికీ చౌకగా ఉంది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఉన్న క్యాంటీన్ ఉత్తర రైల్వే ద్వారా నిర్వహించేంది. అయితే, 2021 సంవత్సరంలో, ఈ కేటగిరీని ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. కొత్త ధరల గురించి మాట్లాడితే ఇక్కడ ఒక్క చపాతీ ధర రూ.3. కాగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ధర రూ.100, రూ.75. ఇది కాకుండా శాండ్‌విచ్ ధర రూ.3-6, శాఖాహారం థాలీ ధర రూ.100.
మొదట్లో ఈ క్యాంటీన్ చాలా చిన్నగా ఉండేది.కట్టెల పొయ్యిల మీద వంటకాలుచేసేవారు. తర్వాత గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుండి ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఈ క్యాంటీన్‌లో భోజనం చేశారు. అయితే కాలంతో పాటు క్యాంటీన్ ఏర్పాట్లలో సంవత్సరానికి చాలా మార్పులు వస్తున్నాయి.
1950లు, 1960లలో, పార్లమెంట్ క్యాంటీన్ చాలా చిన్నదిగా, సాంప్రదాయకంగా ఉండేది. ఈ సమయంలో ఆహార ధరలు భారీగా సబ్సిడీ ఉండేది. ఈ సమయంలో శాఖాహారం థాలీ ధర 50 పైసలు. దీంతో పాటు ఎంపీలకు టీ, స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలు చౌక ధరలకు అందుబాటులో ఉండేవి.
కానీ 1970, 1980లలో ఆహార ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. అప్పట్లో శాఖాహారం థాలీ రూ.30కి లభించేది. చికెన్ కర్రీ రూ.50 ఉండగా, రోటీ రూ.2 పలికింది. ఈ ధరలు 1990ల వరకు కొనసాగాయి. 1960లలో, పార్లమెంటు క్యాంటీన్‌లో సాధారణ మార్పు వచ్చింది. LPG గ్యాస్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. 1968లో, IRCTC, భారతీయ రైల్వేలు ఉత్తర జోన్, క్యాంటీన్ పనిని చేపట్టింది.
క్యాంటీన్ నిర్వహణ IRCTC ఆధీనంలో ఉన్నంత వరకు, 400 మంది సిబ్బందిని అందులో ఉంచారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు దాదాపు 500 మందికి భోజనం వండుతారు. ఉదయం 11 గంటలకే భోజనం తయారుచేస్తారు. గతేడాది ఇదే సమయానికి క్యాంటీన్‌లో మొత్తం 90 ఆహార పదార్థాలు ఉన్నాయి. అల్పాహారం, భోజనం తదితర ఏర్పాట్లు ఉన్నాయి. అయితే జనవరి 27 నుంచి ఈ క్యాంటీన్‌ను ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. దీంతో ఆహార పదార్థాల సంఖ్య 48కి తగ్గింది. అయితే, ఆహారం పరిశుభ్రత రుచి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు.