RuPay vs Visa Card: రూపేకార్డ్ vs వీసా కార్డ్ ఈ రెండింటి తేడా ఏంటి? ఏ కార్డు వాడితే కస్టమర్‎కు బెనిఫిట్

RuPay vs Visa: భారతదేశం...ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. మనదేశంలో ఆన్ లైన్ లావాదేవీలతోపాటుగా డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపులు ట్రెండ్ అనేది ఆ మధ్య కాలంలో జోరుగా సాగుతోంది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. మరి ఇందులో రూపే కార్డు వర్సెస్ వీసా కార్డు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి. ఏ కార్డు వాడితే కస్టమర్ కు బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /6

Difference between Rupaycard and Visa cards: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీ లేదా డిజిటల్ లావాదేవీ పెద్దెత్తున జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపుల ట్రెండ్ ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. నేడు, నగదు రహిత విధానంలో కార్డుల ద్వారా అనేక రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే కొత్త కార్డును ఎంపిక చేసుకునే విషయంలో చాలా మంది రూపే, వీసా మధ్య  వ్యత్యాసం ఏంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు.అయితే ఈ రెండింటి కార్డుల మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మీరు చేశారా. రెండు కార్డుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు చూద్దాం.   

2 /6

RuPay కార్డ్ భారతదేశంలో విస్తృతంగా వాడుతున్నారు. కానీ రూపే కార్డు ద్వారా అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లు చేయలేరు. అయితే వీసా దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా వాడుతున్నారు. మీరు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో చెల్లింపులు చేయడానికి వీసా కార్డ్‌ని ఉపయోగించవచ్చు.  

3 /6

ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డ్‌లపై లావాదేవీల ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి.  ఎందుకంటే ఈ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. వీసా అంతర్జాతీయ చెల్లింపు నెట్‌వర్క్ అయినందున, లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందువల్ల, రూపేతో పోలిస్తే ఇది సాపేక్షంగా ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులను కలిగి ఉంది.  

4 /6

రూపే కార్డ్ లావాదేవీలు  వీసా, ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌ల కంటే వేగంగా ఉంటుంది. వీసా కార్డ్‌లో లావాదేవీ వేగం రూపే కంటే చాలా తక్కువగా ఉంటుంది.  

5 /6

 రూపే కార్డ్  ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా గ్రామీణ భారతదేశం. భారతదేశంలో వీసా కార్డులు టైర్ 1,  టైర్ 2 నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి.  

6 /6

రూపే కార్డ్, వీసా కార్డ్ మధ్య ఏ కార్డ్ ఏది బెస్ట్ అనేది మనం ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎలాంటి లావాదేవీలు చేస్తారు. మీరు దేశంలో లావాదేవీలు చేస్తుంటే, రూపే కార్డ్ బెస్ట్ ఛాయిస్. దీని తక్కువ లావాదేవీల రుసుములు, వేగవంతమైన ప్రాసెసింగ్ సమయం రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు అంతర్జాతీయంగా ట్రాన్సక్షన్లు చేసినట్లయితే లేదా తరచూ విదేశాలకు వెళుతున్నట్లయితే, వీసా కార్డ్ ఎంపిక చేసుకోవడం మంచిది.