Moong Sprouts: పెసర మొలకలు తింటున్నారా?అయితే ఇది మీకోసమే..?

Sprouts : సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా పెసర మొలకలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు. 
 

1 /6

మొలకెత్తిన పెసర గింజలు తినడం వల్ల ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ముఖ్యంగా మీరు శాఖాహారులైన లేదా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కచ్చితంగా మొలకెత్తిన పెసలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.   

2 /6

సుమారు 100 గ్రాముల పెసర మొలకలలో నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. గుడ్లు,  చికెన్ లేదా ఇతర జంతు ఆధారిత ప్రోటీన్లతో పోల్చుకుంటే ఇది కాస్త ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. 

3 /6

మొలకెత్తిన పెసలు తినడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం,  జుట్టు అలాగే గోళ్ళు కూడా పొందవచ్చు. చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.  ఇందులో ఉండే ప్రోటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.  శరీరం పోషకాలను గ్రహించడం వల్ల వేగంగా జీర్ణం అవుతాయి. 

4 /6

అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.  రక్తంలో చక్కర స్థాయి నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. 

5 /6

యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి.  ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. 

6 /6

గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం,  రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.