Vishwaksen Recent Movies Pre Release Business: విశ్వక్ సేన్ హీరోగానే కాదు దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరికొన్ని గంటల్లో ‘లైలా’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
విశ్వక్ సేన్ ఒక పద్ధతి ప్రకారం తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. ఒకవైపు కంటెంట్ తో పాటు మార్కెటింగ్ స్ట్రాటజీతో తన సినిమాల మార్కెట్ పరిధి పెంచుకుంటూ వెళుతున్నారు. లైలా మూవీ విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి బిజినెస్ సొంతం చేసుకుంది.
లైలా.. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైలా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మెకానిక్ రాకీ.. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కి న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
గామి.. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.
దాస్ కా దమ్కీ.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘దాస్ కా దమ్కీ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఓరి దేవుడా.. విశ్వక్ సేన్ హీరోగా వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.