Bank Holidays: రెండు రోజులు బ్యాంకు సెలవులు.. ఎందుకో తెలుసా?

Two Days Bank Holiday Know Why And When: బ్యాంకులకు అనూహ్యంగా రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. ఈనెలలో వారాంతపుతోపాటు స్థానికంగా పలు పండుగల నేపథ్యంలో పండుగలు ప్రకటించగా క్యాలెండర్‌లో ప్రకటించని రెండు సెలవులు వచ్చాయి. బ్యాంకు ఖాతాదారులు కూడా ఎందుకు..? ఎప్పుడో తెలుసుకోండి.

1 /5

బ్యాంకు ఉద్యోగులకు భారీ శుభవార్త. క్యాలెండర్‌లో లేని సెలవులు వచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఇక వినియోగదారులు కూడా బ్యాంకులకు ఎందుకు సెలవులు వచ్చాయో తెలుసుకోండి.

2 /5

తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. అధిక పనిగంటలు.. పని ఒత్తిడితో బ్యాంకు సేవలకే తమ జీవితం అంకితం కావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. ఆ రెండు రోజుల పాటు బ్యాంకులు పని చేయకుండా మూకుమ్మడి సమ్మె చేపట్టినట్లు తెలుస్తోంది.

3 /5

బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. యునైటెడ్‌ ఫోర్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమయ్యారు. మొత్తం 9 బ్యాంకు యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి.

4 /5

వారానికి 5 రోజుల పనిదినాలు, కొత్త ఉద్యోగాల ప్రకటన, డీఎఫ్‌ఎస్‌ రివ్యూ తొలగింపు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, రూ.25 లక్షల వేతనం వరకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

5 /5

ఈ రెండు రోజుల సమ్మెపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టడం ఖాయంగా కనిపిస్తున్నా తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ప్రచారం జరుగుతున్న ప్రకారం మార్చి 24, 25 తేదీల్లో ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతదారులు గుర్తు పెట్టుకుంటే ఆ రోజుల్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.