Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇక గదుల బుకింగ్‌కు నో టెన్షన్‌..!

Room Booking In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌. ఎప్పటి నుంచో సరైన గదుల సదుపాయం లేకుండా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. భక్తులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించే దిశగా టీటీడీ యంత్రాంగం అడుగులు వేస్తోంది.
 

1 /5

తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్ధం నిత్యం వేల మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు. అయితే, ప్రతినెలా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ యంత్రాంగం విడుదల చేస్తోంది. ఈ టిక్కెట్లతో మూడు నెలల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు దర్శనార్ధం వస్తారు.  

2 /5

అయితే, అదేరోజు గదుల బుకింగ్ కోటాను కూడా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడతారు. అయితే, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు గదులు దొరకకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

3 /5

ప్రత్యేకంగా లాకర్ల వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ప్రత్యేక రోజుల సమయంలో భక్తులు మరింత పెరుగుతారు. ఆ సమయంలో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

4 /5

ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక కాంప్లెక్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి కాకుండా గదుల ఇబ్బందులు ఎదురు కాకుండా కొత్తగా టీటీడీ కార్యాచరణ చేస్తోంది. యాత్రికుల వసతి సదుపాయం (PAC-5) భవనాన్ని కొత్తగా టీటీడీ నిర్మిస్తోంది.  

5 /5

తిరుమల దేవస్థానం యంత్రాంగం త్వరలో ఈ నిర్మాణాలు పూర్తి చేయనుంది. ఇప్పటికి 16 హాళ్లలో 8 పూర్తయ్యాయి. వీటితోపాటు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాట్లను కూడా పూర్తి చేయనున్నాయి.