TTD Update:. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ల తేదీలను మారుస్తూ టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్ల..తేదీలను మార్చుతూ ప్రకటన చేసింది. ఈ క్రమంలో రేపు పలు టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ దర్శనం టికెట్ల గురించి కూడా తెలియజేసింది టిటిడి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు టీటీడీ టికెట్ విడుదలపై సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో కాస్త మార్పులు చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల తేదీలను టీటీడీ మార్చినట్లు సమాచారం.
మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 25వ తేదీన, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం 2025 మార్చి నెల శ్రీ వాణి టికెట్ల కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయాల్సి ఉండగా.. అలాగే మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తేదీలలో మార్పులు చేసింది.
మార్చి నెల శ్రీ వాణి ప్రత్యేక ప్రవేశ తిరుమల దర్శనం టికెట్ల కోట విడుదల తేదీలలో మార్పులు చేయడం జరిగింది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీ వాణి టికెట్ల కోటాను, అలాగే డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు 2025 మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనుంది..
అలాగే అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తుల ఈ విషయాన్ని గమనించాలని కూడా స్పష్టం చేసింది. ఇంకొక వైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠం ద్వారా దర్శనాలకు అనుమతి కల్పించనున్నారు. ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్లను.. ఈరోజు ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సమాచారం.