TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..

TSPAC Group 4 Category wise Selected List: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్  tspsc. gov. in ఫలితాలను అందుబాటులో ఉంచింది. అయితే కేటగిరీలవారీగా ఎంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఈ గ్రూప్ 4 తుది ఫలితాల్లో విజయం సాధించారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదల చేశారు. ఇక 2023 జూలై నెలలో రాత పరీక్ష నిర్వహించారు.  

2 /5

ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఏడాదిలో పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను నిన్న విడుదల చేశారు. ఈ ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల డిసెంబర్ 9వ తేదీన అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించే అవకాశం ఉంది.  

3 /5

ఇక గ్రూప్ 4 క్యాండిడేట్స్ ఫైనల్ సెల్ రిజల్ట్ లో క్యాటగిరి వారీగా అభ్యర్థులు ఎంత మేర పర్సంటేజ్ సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.. BC - 4447 - 55% SC - 1513 - 19% ST - 730 - 9% OC - 493 - 6% EWS -901 - 11%

4 /5

ఇది ఇలా ఉండగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అతి త్వరలోనే అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించనున్నారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా అందించాలి. 

5 /5

అయితే గ్రూప్ 4 కి సంబంధించి హైకోర్టులో ఒక లీగల్ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ప్రొవిజనల్ సెలక్షన్ కేసు ఆధారంగా ముందుకు కొనసాగుతుంది. ఏవైనా లీగల్‌ వ్యవహారాలు, మోసాలు బయటకు వస్తే రద్దు చేసే అధికారం టీఎస్‌పీఎస్‌సీకి ఉంది.