Trisha: ఫిట్ నెస్ సీక్రెట్స్ బయటపెట్టేసిన త్రిష.. రోజూ ఏం చేస్తుందంటే..!

Trisha Weight Loss Tips: గత రెండు దశాబ్దాలలో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి వెళ్లిపోయారు కానీ.. త్రిష కృష్ణన్ మాత్రం అటు తమిళ్ ఇటు తెలుగు తేడా లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నటనలో మాత్రమే కాకుండా.. అందం, ఫిట్నెస్ లో కూడా కుర్ర హీరోయిన్లను తలదన్నే సత్తా ఉన్న నటి త్రిష. అయితే తాజాగా త్రిష తన ఫిట్నెస్ వెనుక ఉన్న పెద్ద రహస్యాన్ని బయటపెట్టేసింది.

1 /5

41 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్, అందం ఇంతలా మెయింటైన్ చేస్తున్న త్రిష.. చాలామందికి స్ఫూర్తిని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ త్రిష ఇంకా అందంగా మారుతుంది అంటూ..ఎప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు.. దాటినప్పటికీ.. త్రిష ఇంకా జోరుగా ఆఫర్లు అందుకోవడానికి గల కారణం ఫిట్నెస్. దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 /5

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల.. శరీరం ఫిట్ గా ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ చాలా కొంతమంది మాత్రమే.. దీన్ని ఫాలో అవుతారు. ఈ విషయాన్ని కఠినంగా ఫాలో అయ్యే.. హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. త్రిష బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆమె ఒక గంట సేపు కార్డియోతో పాటు వ్యాయామం కూడా చేస్తుంది. 

3 /5

ఆహార విషయంలో కూడా ఆమె చాలా నియమాలు పాటిస్తుంది. పండ్లు కూరగాయలు పుష్కలంగా తినాలి అని చెబుతోంది త్రిష. అయితే మనం తినే పండ్లు కూరగాయలలో కూడా విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అవే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రి డిన్నర్ చాలా త్వరగా పూర్తి చేయాలి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. త్రిష పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటుంది. ఈమె తినే పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా చూస్తుందట. ఇవి ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.   

4 /5

త్రిష వీలైనంత తొందరగా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ఈమె సాయంత్రం 6.30 గంటలకే భోజనం అయిపోగొట్టి.. ఆ  తర్వాత పండ్లు కూడా తినదట. అలాగే తిన్న వెంటనే నీళ్లు తాగనేతాడదు.  ప్రతిరోజు సాయంత్రం 6:30 కల్లా భోజనం చేస్తాను అని చెబుతోంది త్రిష. అంతేకాకుండా ఏదైనా తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట. వ్యాయామంతో పాటు ప్రతిరోజూ యోగా చేయడం కూడా తప్పనిసరి అని అంటుంది ఈ భామ. ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు యోగా కచ్చితంగా చేస్తాను అని చెబుతోంది.  

5 /5

వ్యాయామం, యోగ మాత్రమే కాకుండా స్విమ్మింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి ఆక్టివిటీస్ కూడా తనకి చాలా ఇష్టం అని చెబుతోంది త్రిష. ప్రతిరోజు వీటిని చేయడం వల్లే శరీరంలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీలు కూడా త్వరగా కరిగిపోతాయి అని.. అవే మనం బరువు పెరగకుండా చేస్తాయి అని.. అదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని రివీల్ చేసింది త్రిష.