Latest Local Small Business Idea: సూపర్‌ బిజినెస్ ఐడియా.. రోజుకు రెండు గంటలు కష్టపడితే చాలు.. రోజుకు రూ. 3,000.. నెలకు రూ. లక్ష ఆదాయం

Food Business Idea With Chicken Dum Biryani: ఫుడ్ బిజినెస్ అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదు ఇది ఒక కళ, ఒక అనుభూతి. తినడం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ అవసరాన్ని తీర్చడంలో ఫుడ్ బిజినెస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎంత బిజీగా ఉన్నా ఆకలి మాత్రం ఎప్పుడూ మనల్ని వదలదు. అందుకే ఫుడ్ బిజినెస్‌కు ఎల్లప్పుడూ మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్‌లు, కేఫ్‌లు, బేకరీలు, కేటరింగ్, హోమ్ డెలివరీ... ఫుడ్ బిజినెస్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీ రుచి, మీ ఆలోచనలను ఆహారం ద్వారా ప్రదర్శించే అవకాశం ఇది. ఫూడ్‌ బిజినెస్‌లో మీ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్న కస్టమర్‌ల ముఖాన్ని చూడటం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. అయితే మీరు కూడా ఫూడ్ బిజినెస్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఈ బిజినెస్‌తో మీ వ్యాపారంతో పాటు లాభాలు కూడా పెరుగుతాయి.. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోండి. 

1 /12

 నేటి యువత ప్రత్యేకంగా తమంతట తాము స్వతంత్రంగా ఉండాలని, ఆర్థికంగా స్థిరపడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ కోరిక వారిని వ్యాపారంలోకి నడిపిస్తోంది. ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎప్పుడూ ఎవరికైనా జవాబుదారీగా ఉంటాము. కానీ సొంత వ్యాపారం చేస్తే మనమే మన బాస్‌లు అవుతాము. మన స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.

2 /12

ఉద్యోగంలో జీతం స్థిరంగా ఉంటుంది. కానీ బిజినెస్‌ లో మాత్రం కష్టపడితే ఆదాయం అపరిమితంగా ఉంటుంది. బిజినెస్‌లో మన సృజనాత్మకతను ప్రదర్శించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్పత్తులతో మార్కెట్‌ను ఎంతగానో ఆకట్టుకోవచ్చు.

3 /12

సొంత వ్యాపారం ద్వారా మనం సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. అయితే బిజినెస్‌లో కొన్ని సవాళ్లు కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

4 /12

బిజినెస్‌ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పోటీని ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలు, ప్లాన్‌లు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏ బిజినెస్‌ అయిన విజయవంతంగా ముందుకు సాగుతుంది. అయితే మీరు కూడా ఈ పోటీ ప్రపంచంలో సొంత గుర్తింపు పొందాలని ఆలోచిస్తున్నారా?   

5 /12

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఎంతో డిమాండ్‌ ఉండేది. మీకు ఫూడ్‌ బిజినెస్‌ స్టార్ట్ చేసే ఆలోచన ఉంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఈ బిజినెస్‌ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎలా ప్రారంభించవచ్చు అనేది ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి. 

6 /12

మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఐడియా లోకల్‌ ఫూడ్‌ వ్యాపారం. ప్రస్తుతకాలంలో చాలామంది బయట ఆహారాన్ని తినడానికి ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా టైం సరిపోకపోవడం ఒక ముఖ్యమైన కారణం. ఇంట్లో ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తినడం కంటే బయట వివిధ రకాల ఆహారాన్ని రుచి చూడాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి  మంచి బిజినెస్ ప్రారంభించవచ్చు.  

7 /12

 బిర్యానీకి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఇది కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు ఇది ఒక ఎమోషన్‌. మీరు ఈ లోకన్‌ బిజినెస్‌ ప్రాంభించడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. 

8 /12

సక్సెస్‌ఫుల్‌గా బిర్యానీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను నడపాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్పి ఉంటుంది. మీ వద్ద ఎంత పెట్టుబడి ఉంది? దాని ప్రకారం మీ బిజినెస్ స్కేల్‌ను ఫిక్స్ చేసుకోవాలి. చిన్న ఫుడ్ స్టాల్‌తో ప్రారంభించి, క్రమంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లవచ్చు.

9 /12

 మీ స్టాల్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు? బిజీ రోడ్లు, కళాశాలలు, ఆఫీసులు ఉన్న ప్రాంతాల్లో ప్రారంభిస్తే బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు మీరు ఏ రకాల బిర్యానీలు అమ్మాలనుకుంటున్నారు? చికెన్, మటన్, వెజ్ బిర్యానీలు, అలాగే సైడ్ డిషెస్‌ను కూడా ఆలోచించండి.  

10 /12

ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌కు అవసరమైన లైసెన్స్‌లు, పర్మిట్‌లు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ బిర్యానీ రుచి ప్రత్యేకంగా ఉండాలి. అందుకే, రెసిపీని బాగా ప్రాక్టీస్ చేయండి. నాణ్యమైన ఇంగ్రిడియెంట్స్‌ను ఎంచుకోండి. తాజా మాంసం, బియ్యం, మసాలాలు ఉండేలా చూసుకోండి.

11 /12

 ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు రూ. 50 వేల నుంచి రూ. లక్ష పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ వద్ద డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ ను తీసుకోవచ్చు. 

12 /12

బిర్యానీ లోకల్‌ బిజినెస్‌తో మీరు రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 6 వేలు సంపాదించుకోవచ్చు. నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్షలో ఆదాయం పొందవచ్చు. ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.