Chhath Puja in Yamuna Pollution: విషపూరిత ఫోమ్..అత్యంత ప్రమాదకరమైనా తప్పని పవిత్ర స్నానాలు

ఇది సినిమా సెట్టింగ్ కాదు. భక్తుల పూజల సీన్ షూట్ చేసేందుకు వేసిన సెట్ అంతకంటే కాదు. తెల్లగా కన్పిస్తున్నదంతా విషపూరితమైన నురగ. చాలా ప్రమాదకరమైంది ఇది. యమునా నదిలో నిరంతరం ప్రవహిస్తూ భయపెడుతోంది. మరోవైపు ఛఠ్‌పూజల కోసం భక్తుల ఈ విషపూరిత ఫోమ్‌లోనే స్నానాలు చేస్తున్న ఘోరమైన పరిస్థితి. భయపెడుతున్న ఆ దృశ్యాలు మీ కోసం..

Chhath Puja in Yamuna Pollution: ఇది సినిమా సెట్టింగ్ కాదు. భక్తుల పూజల సీన్ షూట్ చేసేందుకు వేసిన సెట్ అంతకంటే కాదు. తెల్లగా కన్పిస్తున్నదంతా విషపూరితమైన నురగ. చాలా ప్రమాదకరమైంది ఇది. యమునా నదిలో నిరంతరం ప్రవహిస్తూ భయపెడుతోంది. మరోవైపు ఛఠ్‌పూజల కోసం భక్తుల ఈ విషపూరిత ఫోమ్‌లోనే స్నానాలు చేస్తున్న ఘోరమైన పరిస్థితి. భయపెడుతున్న ఆ దృశ్యాలు మీ కోసం..

1 /8

అయితే ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ప్రతియేటా యమునా నదిలో ఇదే కన్పిస్తుంది. ఈసారి పరిస్థితి కాస్త తీవ్రమైనట్టుగా ఉంది. అత్యంత విషపూరితమైన ఫోమ్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. 

2 /8

3 /8

ఢిల్లీ నగరానికి సరఫరా అయ్యే నీటిలో అమ్మోనియో స్థాయి విపరీతంగా పెరిగింది. 3 పీపీఎంకు పెరిగిందని గుర్తించారు. వజీరాబాద్ నుంచి ఓక్లా వరకూ ఉండే 22 కిలోమీటర్ల యుమునా నదీ ప్రవాహంలో 80 శాతం కాలుష్యముందని గుర్తించారు.

4 /8

ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్నించి వస్తున్న శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్ధాల్లో ఉండే ఫాస్పేట్స్, సర్ఫెక్టేంట్స్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందనేది నిపుణుల మాట

5 /8

6 /8

దట్టమైన పొరలా అలముకుని..నీటితో పాటు నది అంతా ఆవహించి ప్రవహిస్తున్న పరిస్థితి ఢిల్లీ యుమునా నదిలోనిది. నాలుగు రోజుల ఛఠ్‌పూజలో భాగంగా ప్రమాదమని తెలిసినా భక్తులు తప్పని పరిస్థితుల్లో పూజలు, స్నానాలు చేస్తున్నారు. 

7 /8

యుమునా నది కాలుష్యంతో నిండిపోయి ప్రమాదకరంగా మారిందని తమకు తెలుసని..కానీ ఛఠ్‌పూజకు సూర్య దేవునికి పూజలు చేసేందుకు ఇది తప్పదనేది భక్తుల వాదన. 

8 /8

ఛఠ్‌పూజకై భక్తులు విషపూరితమైన ఫోమ్‌తో ప్రవహిస్తున్న యమునా నదిలోనే పవిత్ర స్నానాలు, పూజలు చేసుకోవల్సిన పరిస్థితి, ఢిల్లీ కాళిందికుంజ్ వద్ద దుస్థితి ఇది.