Tollywood Heroins Remunartions: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవిత కాలం తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్నట్టు.. డిమాండ్ ఉన్నపుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. నిర్మాతలు కూడా వాళ్ల ఇమేజ్ కు తగ్గట్టు పారితోషికాలు ఇస్తున్నారు. ఇక తెలుగులో సీనియర్ భామలను పక్కన పెడితే.. యంగ్ హీరోయిన్స్ లో ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకొంటున్నారనే విషయానికొస్తే..
ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు కూడా హిందీ కథానాయికలకు ఏ మాత్రం తక్కువ కాకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా మన దక్షిణాది భామలే ఉత్తరాదిని శాసిస్తున్నారు. ప్రెజెంట్ తెలుగులో ఏ హీరోయిన్ ఎంతెంత పారితోషకం తీసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం..
రష్మిక మందన్న.. పుష్ప సిరీస్ తో పాటు యానిమల్ సినిమాలతో రష్మిక మందన్న క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల పారితోషకం తీసుకుంటోంది. త్వరలో ‘చావా’ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమా హిట్టైయితే.. మరో రూ. కోటి పెంచడం గ్యారంటీ అని చెప్పాలి.
శ్రీలీల.. గుంటూరు కారం దెబ్బతో ఒక్కసారిగా శ్రీలీల కెరీర్లో డౌన్ ఫాల్ అయింది. కానీ కుర్చీ మడతపెట్టి సాంగ్ తో ఈమె క్రేజ్ ఇంటర్నేషనల్ లెవల్ కు పెరిగింది. రీసెంట్ గా ‘పుష్ప 2’ కిసిక్ సాంగ్ కోసం దాదాపు రూ. కోటి పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
కియారా అద్వానీ.. కియారా అద్వానీ ప్యాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం దాదాపు రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది.
పూజా హెగ్డే.. ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ ముందు వరకు ఫుల్ ఫామ్‌లో ఉంది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా పూజా కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.
కీర్తి సురేష్.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ దక్షిణాదిలో అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
రాశి ఖన్నా.. రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 60 లక్షల నుంచి రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
నిధి అగర్వాల్.. నిధి అగర్వాల్ ఒక్కో చిత్రానికి రూ. కోటి వరకు పారితోషకం అందుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'హరి హర వీరమల్లు'తో ‘ది రాజా సాబ్’ సినిమాలపై భారీ ఆశలే పెట్టుకుంది.
సాయి పల్లవి.. సాయి పల్లవి నిన్న మొన్నటి వరకు రూ. 1.5 కోటి పారితోషకం తీసుకుంటోంది. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తోన్న 'తండేల్' మూవీ కోసం రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అటు బాలీవుడ్లో తెరకెక్కుతోన్న రామాయణం మూవీ కోసం ఏకంగా రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.