Thandel Pre Release Business: ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్లాపుల్లో ఎక్కడా తగ్గని నాగ చైతన్య..

Thandel Pre Release Business: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది. మొత్తంగా ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

1 /6

Thandel Pre Release Business: ప్రేమమ్, సవ్యసాచి చిత్రాల తర్వాత నాగ చైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో నాగ చైతన్య ‘తండేల్ రాజు’ పాత్రలో నటించారు. లవ్ కమ్ దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

2 /6

టీజర్, ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేసింది. ‘లవ్ స్టోరీ’ తర్వాత చైతూ, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

3 /6

‘తండేల్’ చిత్రాన్ని చందూ మొండేటి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.  ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

4 /6

‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. నాగ చైతన్య కెరీర్ లో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 13 కోట్లు..  తెలంగాణలో రూ. 14.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 27.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ + హిందీ కలిపి రూ. 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /6

ప్రపంచ వ్యాప్తంగా ‘తండేల్’ మూవీ రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 42 కోట్ల  బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కుమ్మేయడం ఖాయం.

6 /6

‘తండేల్’ సినిమా మొత్తంగా రూ. 90కోట్ల బడ్జెట్ అయింది.  ఈ సినిమా నాన్ థియేట్రికల్ గా.. నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 40 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక మ్యూజిక్ రైట్స్ రూ. 7 కోట్లు.. హిందీలో డబ్బింగ్ వెర్షన్ రూ. 8 కోట్లు.. మిగిలిన శాటిలైట్ రైట్స్ రూ. 10 కోట్లు ముందుగానే వచ్చేసింది. మొత్తంగా నాన్ థియేట్రికల్ గానే ఈ సినిమా రూ. 65 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుంది.