Allu Arjun: తండేల్ ఈవెంట్‌కు డుమ్మాకొట్టిన బన్నీ.. షాకింగ్ నిజం బైటపెట్టిన అల్లు అరవింద్..

Thandel movie jathara: తండేల్ ప్రీరిలీజ్ జాతర ఈవెంట్ కు బన్నీ లాస్ట్ మినిట్ లో రాలేదు. అయితే.. దీనిపై అల్లు అరవింద్ అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

1 /6

తండేల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఫిబ్రవరి 7 విడుదల కానుంది. చందు మొండెటి దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో రెండో సారి చైతు, సాయి పల్లవి అభిమానుల్ని అలరించనున్నారు.  

2 /6

చైతు, సాయి పల్లవి కాంబోలో.. వచ్చిన తొలి సినిమా లవ్ స్టోరీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరి రెండో కాంబోనేషన్ మూవీ తండేల్ పై భారీగా హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పుకొవచ్చు.  

3 /6

ఇదిలా ఉండగా.. ఈ మూవీ జాతర ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ కార్యక్రమానికి తొలుత బన్నీ వస్తారని మూవీ మేకర్స్ ప్రకటించారు.  దీంతో అభిమానులు ఫుల్ జోష్ గా కార్యక్రమానికి హజరయ్యారు. కానీ చివరి నిమిషంలో బన్నీ రాలేకపోయారు. 

4 /6

అయితే.. బన్నీ స్థానంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈవెంట్ కు హజరయ్యారు. ఇదిలా ఉండగా..దీనిపై ఈవెంట్ లో అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.

5 /6

అల్లు అర్జున్ తండేల్ జాతర ఈవెంట్ కోసం విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చారని చెప్పారు. కానీ బన్నీ తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నాడని వెల్లడించారు. అందుకే ఈవెంట్ కు  రాలేకపోయారన్నారు.

6 /6

తండేల్ మూవీ 2018 లో  శ్రీకాకుళం నుంచి గుజరాత్ కు వలస వెళ్లిన చేపలు పట్టేవాళ్ల  కథ ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో మత్య్సకారులు  పొరపాటున పాక్ బొర్డర్ క్రాస్ చేసి అక్కడి కోస్ట్ గార్డ్ సిబ్బందికి బందీలుగా చిక్కారు. ఈకథను బేస్ చేసుకుని తండెల్ మూవీ తీశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్య్సకారులను చైతు వేదికపైకి పిలిచి, వారిని ప్రశంసలు కురిపించారు.