Tata Sales: టాటా ఈవీ వాహనాల్లో పెరిగిన విక్రయాలు, 57 శాతం పెంపు నమోదు

టాటా మోటార్స్  ప్రయాణీకుల వాహనాల డొమెస్టిక్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 6 శాతం తగ్గిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా టాటా కంపెనీనే వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో టాటా మోటార్స్ వాహనాలు 44,809 విక్రయమయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 47,654 యూనిట్లుగా ఉంది.

Tata Sales: టాటా మోటార్స్  ప్రయాణీకుల వాహనాల డొమెస్టిక్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 6 శాతం తగ్గిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా టాటా కంపెనీనే వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో టాటా మోటార్స్ వాహనాలు 44,809 విక్రయమయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 47,654 యూనిట్లుగా ఉంది.

1 /5

ట్రక్ 2 టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల్లో డొమెస్టిక్ విక్రయాలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో  6 శాతం పెరిగి 99, 178 యూనిట్లు నమోదు చేసింది.

2 /5

ట్రక్ టాటా కంపెనీ సెప్టెంబర్ నెలలో కమర్షియల్ వాహనాల అమ్మకాలు 12 శాతం పెరిగి 39,064 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 34, 890 యూనిట్లు అమ్మకాలయ్యాయి.

3 /5

నెక్సాన్ ఈవీ టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో గత ఏడాదితో పోలిస్తే 57 శాతం పెరిగి 6,050 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఈ సంఖ్య 3,864 యూనిట్లు మాత్రమే ఉంది. 

4 /5

టాటా నెక్సాన్ దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ మొత్తం వాహనాలు విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగాయి. మొత్తం 82, 023 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 

5 /5

హ్యారియర్ టాటా మోటార్స్ పాజెంజర్ వెహికల్ లిమిటెడ్, టాటా పాసెంజక్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,38,939 కార్లు , ఎస్‌యూవీలు అమ్మకాలు నమోదు చేసింది.