Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

Tata Curvv EV: గత కొద్దకాలంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఈవీ వాహనాల్లో అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్ మరో అద్భుతమైన ఈవీ కారు లాంచ్ చేసింది. ఈ కారు ధర 17.49 లక్షల నుంచి ప్రారంభమౌతుంది

Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ మొత్తం 7 వేరియంట్లలో లభ్యమౌతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఈ ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిల్లీమీటర్లు. 5 వేర్వేరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా డ్రైవింగ్ రేంజ్ 549.43 కిలోమీటర్లు. ఈ కారు కొనాలంటే జీతం ఎంత ఉండాలనే వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

టాటా కర్వ్ ఈవీ కొనాలంటే ఈఎంఐ ఎంత ఉండాలి టాటా కర్వ్ ఈవీ కారు కొనేందుకు 15 లక్షలు లోన్ తీసుకుంటే 4 ఏళ్ల కాల వ్యవధికి 9.5 శాతం వడ్డీ ఉండవచ్చు. అంటే నెలకు ఈఎంఐ 37,685 రూపాయలు ఉండాలి. అంటే మీ జీతం 3.5 లక్షలు ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ బడ్జెట్ అస్థిరమవుతుంది

2 /5

లోన్ కాల పరిమితి లోన్ కాల పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. లోన్ కాల పరిమితి 4 ఏళ్లు దాటకూడదు. దీర్ఘకాలం లోన్ ఉంటే వడ్డీ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. 

3 /5

ఈఎంఐ ఎంత ఉండాలి మీరు ఎప్పుుడు కారు లోన్ తీసుకోవాలన్నా..ఈఎంఐ అనేది మీ నెల జీతంలో 10 శాతం దాటకూడదు. అంటే మీ నెల జీతం 1 లక్ష రూపాయలుంటే ఈఎంఐ 10 వేల కంటే ఎక్కువ ఉండకూడదు

4 /5

20 శాతం డౌన్ పేమెంట్ రూల్ టాటా కర్వ్ ఈవీ ఎక్స్ షోరూం ధర 17.49 లక్షలుగా ఉంది. ఇక ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇతర సేవలు, అన్నీ కలుకుకుంటే 18.55 లక్షల రూపాయలవుతుంది. ఈ కారు ధరలో 20 శాతం డౌన్ పేమెంట్ అంటే 3.71 లక్షలు అవుతుంది.

5 /5

టాటా కర్వ్ ఈవీ టాటా కర్వ్ ఎస్‌యూవీ ఈవీ కొనే ఆలోచన ఉంటే మీ ఆర్ధిక పరిస్థితిని ఓసారి చెక్ చేసుకోండి. ఈ కారు కొనాలంటే కొన్ని కీలకమైన విషయాలను పరిగణలో తీసుకోవాలి. డౌన్ పేమెంట్, ఈఎంఐ, లోన్ టెన్యూర్ వంటివి చెక్ చేసుకోవాలి.