State Bank Of India Life Insurance Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదో తరగతి ఉత్తీర్ణతతో మంచి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా.? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
State Bank Of India Life Insurance Job Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇన్సూరెన్స్ సంబంధించిన కోటాలు ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ అడ్వైజర్, లైఫ్ మిత్ర విభాగాల్లో ఉన్న పోస్టులకు దరఖాస్తును ప్రక్రియను ప్రారంభించింది. అలాగే ఈ జాబ్ ని అప్లై చేసుకుని అభ్యర్థులకు సంబంధించిన కొన్ని అర్హతలను కూడా పేర్కొంది.
అయితే ఈ పోస్టులను అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున 25 గంటల పాటు ట్రైనింగ్ ను అందిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వెంటనే ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు, గృహిణీలకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు..
ఇక ఈ లైఫ్ మిత్ర పోస్ట్‌లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ మూడు విభాగాలకు సంబంధించిన జాబులు చేయాలనుకునేవారు పదవ తరగతి పాసై ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ జాబ్స్ని ఎలాంటి అనుభవం లేని అభ్యర్థులు కూడా పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాల వివరాల్లోకి వెళితే.. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన పాలసీ చేస్తే దానిపై కమిషన్ వస్తుంది. పాలసీని బట్టి 30% వరకు కమిషన్ వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ అభ్యర్థులకు బెనిఫిట్స్‌తో పాటు కొన్ని రివార్డ్స్ ను కూడా అందిస్తున్నారు.
ఇక ఈ జాబ్స్ కి సంబంధించిన కనీస వయస్సు పరిమితిని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కనీస వయస్సు పరిమితి 18 సంవత్సరాలు ఉంటే చాలు. అంతేకాకుండా గరిష్ట వయస్సు పరిమితిని నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. దీన్ని బట్టి చూస్తే ఎంత వయస్సు ఉన్న ఈ పోస్టులకు అర్హులుగానే భావించవచ్చు.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక వివరాల్లోకి వెళితే..IRDAI నిర్వహించే పరీక్షల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగం లభిస్తుంది. అలాగే అభ్యర్థులు తప్పకుండా ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో కొన్ని ఫార్మ్స్ ఫీల్ చేయాల్సి ఉంటుంది.