Priyanka Chopra Nick Jonas: ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌ల గారాల పట్టి పేరు ఏంటో తెలుసా...

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ జంట ఈ ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ జంట తమ బిడ్డ ఫోటోలను బయటపెట్టలేదు. కనీసం పేరు కూడా వెల్లడించలేదు. అయితే తాజాగా కొన్ని మీడియా రిపోర్ట్స్ ద్వారా ప్రియాంక-నిక్ దంపతుల కూతురి పేరు బయటకొచ్చింది.
  • Apr 21, 2022, 09:25 AM IST

Priyanka Chopra-Nick Jonas Daughter: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ జంట ఈ ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ జంట తమ బిడ్డ ఫోటోలను బయటపెట్టలేదు. కనీసం పేరు కూడా వెల్లడించలేదు. అయితే తాజాగా కొన్ని మీడియా రిపోర్ట్స్ ద్వారా ప్రియాంక-నిక్ దంపతుల కూతురి పేరు బయటకొచ్చింది.

1 /6

టీఎంజెడ్‌ మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ప్రియాంక-నిక్ జంట తమ కూతురికి 'మాల్టీ మేరీ చోప్రా జోనస్' అని పేరు పెట్టారు.  

2 /6

బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ప్రియాంక-నిక్ కూతురు అమెరికాలోని శాండీయాగోలో జనవరి 15, ఉదయం 8గంటల తర్వాత పుట్టినట్లు టీఎంజెడ్ మీడియా రిపోర్ట్స్‌లో పేర్కొన్నారు.

3 /6

తమ కూతురికి ఇద్దరు పేర్లు కలిసొచ్చేలా పేరు పెట్టుకున్నారు ప్రియాంక దంపతులు. 

4 /6

'మాల్టీ మేరీ చోప్రా జోనస్‌'లో 'మాల్టీ' అనే పదం సంస్కృతం మూలం నుంచి వచ్చింది. దీని అర్థం సువాసన వెదజల్లే చిన్న పువ్వు లేదా చంద్రకాంతి.

5 /6

ఇక మేరీ అనే పదం లాటిన్ మూలం నుంచి వచ్చింది. దీని అర్థం 'సముద్ర నక్షత్రం'. మేరీ అంటే జీసస్ తల్లి అని తెలిసిందే.

6 /6

ఇటీవల ఓ సందర్భంలో ప్రియాంక తన కూతురి గురించి మాట్లాడుతూ... తన ఆశలు, నమ్మకాలు, భయాలు, కోరికలు ఇవేవీ తన బిడ్డపై రద్దదలుచుకోలేదని పేర్కొంది. పిల్లల ఇష్టాఇష్టాల ప్రకారమే వారిని నడుచుకోనివ్వాలని అభిప్రాయపడింది.