IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. జట్టులో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని విడుదల చేయాలి..? వేలంలో తిరిగి ఎవరిని తీసుకోవాలి..? వంటి విషయాలపై ఓ అవగాహనకు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నుంచి నిబంధనలు రాగానే అందుకు అనుగుణంగా ప్లాన్ చేయనుంది.
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ టీమ్ దుమ్ములేపింది. దుకుడైన ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచింది.
వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో ఎవరిని రిలీజ్ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
వేలంలో ఆచితూచి వ్యవహరించే టీమ్ ఓనర్ కావ్య మారన్.. ఈసారి ఓ ఫాస్ట్ బౌలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఉమ్రాన్ మాలిక్‌ను వదులుకోవాలని కావ్య మారన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
2022 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరుఫున ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.
అయితే గత రెండు సీజన్‌లలో విఫలమయ్యాడు. 2023 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి.. 8 వికెట్లే తీశాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడగా.. ఆ మ్యాచ్‌లోనూ 15 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుని బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఉమ్రాన్ మాలిక్‌ను ఎస్ఆర్‌హెచ్ వదులుకోవాలని భావిస్తుండగా.. ముంబై ఇండియాన్స్ అతనిపై కన్నేసింది.
150 కి.మీ సగటుతో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టే ఉమ్రాన్ మాలిక్‌ను.. బుమ్రాకు తోడు కీ బౌలర్‌గా మార్చుకోవాలని ముంబై చూస్తోంది.