Share Market: ఎక్కౌంట్లో ఓ 15 వేలు సిద్ధంగా ఉంచండి చాలు..నాలుగు ఐపీవోలు త్వరలో

ఐపీవోల పెట్టుబడి అనేది చాలా సందర్భాల్లో లాభాలు కురిపిస్తుంది. రానున్న కొద్దిరోజుల్లో పలు కంపెనీల ఐపీవోలు రానున్నాయి. మీరు కేవలం 15 వేలు సిద్ధంగా పెట్టుబడి పెడితే చాలు..మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. త్వరలోమార్కెట్‌లో రానున్న ఐపీవోల గురించి తెలుసుకుందాం..

Share Market: ఐపీవోల పెట్టుబడి అనేది చాలా సందర్భాల్లో లాభాలు కురిపిస్తుంది. రానున్న కొద్దిరోజుల్లో పలు కంపెనీల ఐపీవోలు రానున్నాయి. మీరు కేవలం 15 వేలు సిద్ధంగా పెట్టుబడి పెడితే చాలు..మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. త్వరలోమార్కెట్‌లో రానున్న ఐపీవోల గురించి తెలుసుకుందాం..

1 /4

మద్యం తయారు చేసే కంపెనీ సులా వైన్‌యార్డ్స్ ఐపీవో త్వరలో రానుంది. కంపెనీ ఐపీవోకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతి లభించింది. కంపెనీ ఈ ఏడాది జూలైలో పబ్లిక్ ఇష్యూ కోసం డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. ఇక మార్కెట్‌లో రావడమే ఆలస్యం.

2 /4

రుస్తుమ్ జీ గ్రూప్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ త్వరలో ఐపీవో ద్వారా 635 కోట్ల రూపాయలు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ షేర్ల కోసం నవంబర్ 11న ఆక్షన్ ఉంటుంది. ఈ ఇష్యూ నవంబర్ 14 నుంచి నవంబర్ 16 మధ్యలో ఉంటుంది. కంపెనీ షేర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింట్లోనూ లిస్ట్ కానుంది.

3 /4

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్‌బీఎఫ్‌సి ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీవో ద్వారా 1600 కోట్ల రూపాయలు సమీకరించనుంది. సెబికు ఇప్పటికే ప్రాధమిక డాక్యుమెంట్లు సమర్పించింది. డీఆర్‌హెచ్‌పి ప్రకారం ఈ ఐపీవో కింద..ఎన్‌బీఎఫ్‌సి తరపు నుంచి 750 కోట్ల రూపాయలు కొత్త షేర్ల విడుదలతో 850 కోట్ల రూపాయల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

4 /4

ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఐపీవో లాంచ్‌కు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 658 కోట్ల రూపాయలు సమీకరించింది. ఓ రకమైన సముద్ర రసాయనం తయారుచేసే ఈ కంపెనీ ఐపీవో ఇవాళ ఓపెన్ అయింది. నవంబర్ 11వ తేదీన క్లోజ్ కానుంది. కంపెనీ షేర్ ఒక్కొక్కటి 407 రూపాయల చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు 1,61,67,991 షేర్లు కేటాయించింది.