Samantha Career: ప్రముఖ హీరోయిన్ సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన సినిమాల గురించి మాట్లాడుతూ సమంత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఇంతకీ సమంత ఏమి చెప్పింది అనే విషయం ఒకసారి చూద్దాం..
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. సమంత కెరియర్ విషయానికి వస్తే.. పెళ్లికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా సాగుతోంది. నాగచైతన్యతో పెళ్లికి ముందు సమంత స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ ఉండేది.
వివాహమనంతరం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటించింది సమంత. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత అదే తరహా పాత్రలలో నటిస్తూ.. కథ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి అయినా గ్లామర్ పాత్రలు చేయడానికి అయినా సిద్ధం అయ్యింది సమంత.
అయితే ఇటీవల సమంత చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను తలుచుకుంటే ఎన్నో సాధారణ సినిమాలను ఒప్పుకునేదాన్ని.. కానీ ప్రస్తుతం తాను ఆ పరిస్థితులలో లేనని.. తాను చేస్తున్న ప్రతి సినిమా కూడా తన చివరి సినిమా గానే భావించి నటిస్తూ ఉన్నానని తెలియజేసింది సమంత. కచ్చితంగా తాను నటించే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించాలని తెలియజేసింది. అలాంటి పాత్రలను మాత్రమే చేస్తానంటూ కూడా తెలిపింది సమంత.
అలాగే డైరెక్టర్ రాజ్ అండ్ డీకే గురించి మాట్లాడుతూ.. వారిద్దరూ తనకు చాలెంజింగ్ పాత్రలను ఇస్తూ ఉంటారని.. ఫ్యామిలీ సీజన్ 2 లో తనను విలన్ గా చూపించారని.. సిటాడెల్ లో తనని బీభత్సమైన యాక్షన్ హీరోయిన్గా చూపించారని.. వీరితో కలిసి మరొక ప్రాజెక్టు చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ లనే ఈ సినిమాను నిర్మిస్తోంది సమంత. అలాగే టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళతో కూడా సమంత సినిమాలు తీయడానికి సిద్ధమయ్యిందట. బాలీవుడ్ లో కూడా మరొక స్టార్ హీరో చిత్రంలో నటించబోతోందని సమాచారం.