Samantha: అతన్ని నేనెప్పటికీ వదులుకోను.. ఫైనల్ గా తన సీక్రెట్ ఫ్రెండ్ గురించి బయటపెట్టిన సమంత

Samantha Secret Friend: సంతోషంలో ఉన్నప్పుడే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుండేవాడే నిజమైన ఫ్రెండ్ అని, సమంత విషయంలో మరొకసారి నిరూపించారు ఆమె సీక్రెట్ ఫ్రెండ్. మరి సమంత అంతగా ఇష్టపడిన వారెవరు.. ఎందుకు ఆమె అంతగా ఇష్టపడింది అన్న విషయాన్ని చూద్దాం..

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె,  టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని వారసుడు నాగచైతన్యతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, వివాహం జరిగిన నాలుగేళ్లకే అతనితో విడాకులు తీసుకొని,  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.  ముఖ్యంగా అటు నెటిజన్స్, ఇటు ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా సమంతను టార్గెట్ చేస్తూ సమంతాదే తప్పు అన్నట్టు కామెంట్లు చేశారు. 

2 /5

ఇక ఆ బాధ నుంచి బయటపడ్డ సమంత.. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది.. ఇక దాంతో ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడానికి ముందు విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషీ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఏడాది పాటు విరామం ఇచ్చి మళ్లీ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3 /5

ఇకపోతే ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యింది సమంత.  ఇదిలా ఉండగా తాజాగా అతనిని నేనెప్పటికీ వదులుకోను అంటూ షాకింగ్ కామెంట్లు చేసి అభిమానులను అయోమయానికి గురిచేసింది. ఇక ఇది చూసిన కొంతమంది ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు సమంత ఎవరి గురించి చెప్పింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. 

4 /5

సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో రాహుల్ రవీంద్రన్ ప్రథమ స్థానంలో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ గాయని చిన్మయిను వివాహం చేసుకున్న రాహుల్ , సమంతతో సుదీర్ఘ స్నేహాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సమంత నటించిన ఎన్నో సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో కాలక్రమేనా వారి మధ్య స్నేహబంధం మరింత బలపడింది. సమంత కష్టతరమైన రోజులలో కూడా రాహుల్ ప్రతిరోజు ఆమెను సందర్శించేవాడు. ఆమెతో సమయం గడిపేవాడు. ఆమెను ఉత్సాహపరిచేందుకు జోకులు కూడా వేసేవారు. అంతేకాదు సమంత కోసం చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టేవారని సమంతా పంచుకుంది.

5 /5

ముఖ్యంగా తనను మానసికంగా సమస్యలను ఎదుర్కోవడానికి  సిద్ధపడేలా చేసింది రాహుల్ రవీంద్రన్ అంటూ తెలిపింది. అందుకే రాహుల్ అద్భుతమైన స్నేహితుడని, తనని తన జీవితంలో ఎప్పటికీ వదులుకోను అని,  అతడికి కృతజ్ఞతలు తెలియజేసింది సమంత. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.