Newborn Baby Weight How Much Will Be There: మారిన జీవనశైలి కారణంగా సంతానం కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలిగిన సంతానం కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల పోషణలో తప్పనిసరిగా పాప బరువు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. బరువు అనూహ్యంగా తగ్గడం.. పెరగడం రెండూ ప్రమాదమే! శిశువు బరువు ఎంత ఉండాలో తెలుసుకోండి.
పుట్టిన శిశువు బరువు అనేది అనేక వాటిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పూర్తికాల శిశువు (9 నెలలు నిండిన తర్వాత పుట్టిన శిశువు) బరువు 2.5 కిలోల కంటే ఎక్కువగా ఉండాలని చెబుతారు. 10వ నెలలో జన్మించిన పిల్లల బరువు: 3 నుంచి 4 కిలోల వరకు ఉంటుంది.
ఏడో లేదా ఎనిమిదవ నెలలో పుట్టిన పిల్లల బరువు: సాధారణంగా వీరి బరువు తక్కువగా ఉంటుంది. ఒకవేళ కవలలు పుడితే కనుక సాధారణంగా ఒక్కొక్కరి బరువు తక్కువగా ఉంటుంది. పుట్టినప్పుడు 2.5 నుంచి 3 కిలోల బరువు ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువును తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ అని అంటారు.
శిశువు బరువు తక్కువగా ఉండటానికి కారణాలు: 9 నెలలు నిండకుండానే పుట్టడం వల్ల బిడ్డ బరువు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ బరువు ఉండడానికి మధుమేహం, అధిక రక్తపోటు, గర్భంలో పోషకాల లోపం వంటివి కారణమవుతాయి. శిశువు సాధారణ బరువు కన్నా తక్కువగా ఉండవచ్చు. కవలలు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న బరువు తక్కువగా ఉంటారు. శిశువు బరువు తక్కువగా ఉండటానికి వైద్యుడు కారణాన్ని గుర్తించి చికిత్సను అందిస్తారు.
తల్లిపాలు శిశువుకు అత్యంత ముఖ్యమైన ఆహారం.. తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది. శిశువు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఇది ముఖ్యం.
శిశువు బరువు పెరగడానికి కొంత సమయం పడుతుంది. శిశువుల శరీరం బట్టి కొంతమంది నెమ్మదిగా బరువు పెరుగుతారు. శిశువుల బరువుపై ఎలాంటి ఆందోళన ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.