Game Changer movie mistakes: గేమ్ చేంజెర్ లో అత్యంత పెద్ద తప్పు.. శంకర్ ఇంత చిన్న విషయం కూడా ఆలోచించలేదా..?

Game Changer mixed reviews: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా గేమ్ చేంజెర్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్ దర్శకత్వం గురించి ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

1 /7

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా.. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం గేమ్ చేంజర్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అభిమానులే యవరేజ్ అంటుంటే.. మిగతావారు ఈ చిత్రం అస్సలు బాగాలేదు అని అంటున్నారు. ఏదేమైనా.. సంక్రాంతి పండుగ కాబట్టి.. ఈ చిత్రంకి మినిమం కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. 

2 /7

ఈ క్రమంలో ట్విట్టర్లో ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రామ్ చరణ్ తన రెండు పాత్రలకి తన వంతు న్యాయం చేసిన.. శంకర్ దర్శకత్వం మాత్రం తేలిపోయింది అని అంటున్నారు అందరూ. ఒకప్పుడు ఒకే ఒక్కడు, భారతీయుడు, జెంటిల్ మెన్ లాంటి అద్భుతమైన పొలిటికల్ డ్రామాలు తీసిన ఈ దర్శకుడు.. కనీసం కూడా ఆలోచించకుండా ఈ గేమ్ చేంజర్ సినిమా తీసారేమో అని ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

3 /7

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సినిమాలో ఎన్నో సీన్లు.. మనకు చాలా సిల్లీగా అనిపించడం ఖాయం. ఈ చిత్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ మినిస్టర్ ఇలా…అన్ని తానే అయి కనిపించారు రామ్ చరణ్. ఈ విషయం పక్కన పెడితే.. అసలు ఈ సినిమాలో చూపించే ఎలక్షన్ సీన్స్ చూస్తే.. దర్శకుడు కొంచెం కూడా ఆలోచించకుండా తనకు ఇష్టం వచ్చినట్టు తీసారేమో అనిపిస్తది. 

4 /7

ముఖ్యంగా ఈ సినిమాలో చివరిగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు.. ప్రజా అభ్యుదయం, అభ్యుదయం పార్టీ మధ్య పోటీ మాత్రమే చూపిస్తారు. అయితే ప్రజా అభ్యుదయం అనే పార్టీ అప్పుడే కొత్తగా పెట్టే పార్టీ. మరి అంతకుముందు అభ్యుదయం పార్టీతో పోటీ చేసిన పార్టీ ఏది అనేది ఎంతోమందికి ఉన్న ప్రశ్న? ఇంత చిన్న లాజిక్ అంత అనుభవం ఉన్న శంకర్ ఎలా మర్చిపోయారో మనకు అస్సలు అర్థం కాదు. 

5 /7

మరోపక్క అసలు ప్రజా అభ్యుదయం పార్టీకి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు అనే స్ట్రాంగ్ రీసన్ కూడా మనకు ఎక్కడా చూపివ్వరు. ఈ పార్టీకి కాబోయే సీఎం రామ్ చరణ్ అని చివరి వరకు ఆ పార్టీ ప్రకటించదు. అయినా కానీ ప్రజలు ఆ పార్టీని ఎంతో మెజారిటీతో గెలిపిస్తారు.   

6 /7

 వీటన్నిటికన్నా మించి.. ఏకంగా అప్పన్నని చంపిన శ్రీకాంత్.. చివర్లో అప్పన్న కొడుకుకి ఆ పార్టీ ఇచ్చి ఎందుకు చచ్చిపోతారో కూడా అర్థం కాదు. శ్రీకాంత్ మారడానికి కారణాలు కూడా ఎక్కడ చూపించరు.  మరి కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథలో ఇన్ని మైనస్లు ఉన్నాయా.. లేకపోతే శంకర్ తనకు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వెళ్ళారా తెలియదు కానీ.. మొత్తం మీద ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఏదో తీయాలని శంకర్ తీసినట్టు.. అనిపించడం ఖాయం. 

7 /7

మరోపక్క చాలా సీన్స్ లో కెమెరా తిరుగుతూనే ఉంటుంది. అసలు అలా ఎందుకు ఆ షాట్స్ పెట్టారో కూడా అర్థం కాదు. ఈ కెమెరా ని తిప్పడం పైన శంకర్ పెట్టిన శ్రద్ధ.. కథను తిప్పదంలో పెట్టుంటే కొంచెం మంచిగా ఉండేదేమో.