PP on Allu Arjun Arrest: సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మహిళ మృతి చెందినందుకు అల్లు అర్జున్ కారణమంటూ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కు తరలించింది. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం ముందస్తుగానే పర్మిషన్ తీసుకున్నట్లు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
కోర్టులో అల్లు అర్జున్ తరఫున న్యాయవాది ఉద్దేశపూర్వకంగా చేయలేదు కదా అని వాదించారు దీనికి కూడా పిపి అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ తెలుసు.. ఇలా గతంలో జరిగిన ఘటనలు కూడా పై అవగాహన ఉంది అని వాదించారు.
అంతేకాదు సంధ్యా థియేటర్‌లోకి రావడానికి అల్లు అర్జున్, రష్మిక ఇతర కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకున్నారు. కానీ జూలుస్ తీయడానికి, రోడ్ షో చేయడానికి పర్మిషన్ తీసుకోలేదు కదా? అని పిపి వాదించారు.
ఇలా జులూస్ తీసి రోడ్ షో చేయడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. అందుకే తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ ప్రాణాలు పోయాయి అని పి పి గారు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు అరెస్టు చేసిన అల్లు అర్జున్ 14 రోజులపాటు చంచల్ గూడకు రిమాండ్ కు తరలించారు. అయితే క్వాష్ పిటిషన్ రెండోసారి వేసే అవకాశం లేదు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న జడ్జి అర్జున్ ను రిమాండ్ కు తరలించారని తీర్పునిచ్చింది. సెక్షన్ల ప్రకారం నాలెడ్జ్, ఇంటెన్షన్ లేదు అయితే ఫ్యాన్స్ ఎక్కువమంది వస్తారని నాలేడ్జ్ అల్లు అర్జున్ కు ఉంది అని పీపీ వాదించారు.
కాబట్టి మధ్యంతర బెయిలు వేసుకోమని పీపీ సూచించారు. తాజాగా అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ దొరికింది. నాంపల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.