Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్

Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం. 
 

1 /6

Pension: మీరు ప్రైవేట్ ఉద్యోగులు అయితే మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. తక్కువ జీతం అందుకునే ఉద్యోగులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ స్కీమ్ లేదా పీఎఫ్ స్కీమ్ విడుదల చేసింది. దీని ప్రయోజనాలను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

2 /6

ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకే మెరుగైన పెన్షన్ అందేది. ఈ స్థాయిలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందే ఛాన్స్ ఉంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం. 

3 /6

ప్రభుత్వం ఈపీఎఫ్ఓ సభ్యులకు బేసిక్ శాలరీ లిమిట్ ను రూ. 15,000 నుంచి రూ. 21,000కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు 2025లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత అందుకునే పెన్షన్ భారీగా పెరుగుతుంది. అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ స్కీం కింద లక్షల మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. 

4 /6

సాధారణంగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 12శాతం ప్రావిడెండ్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు. వారు పనిచేస్తున్న కంపెనీకూడా 12శాతం కాంట్రిబ్యూట్ ను ఈపీఎఫ్ఓలో డిపాజిట్ చేస్తుంది. అయితే కంపెనీ చేసిన కాంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా విభజిస్తారు. 8.33శాతం ఎంప్లాయిస్ పెన్సన్ స్కీమ్ కు వెళ్తుంది. 3.67శాతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీములో జమ అవుతుంది. ఈవిధంగా పెన్షన్ లో జమ అయిన మొత్తం దానిపై అందించిన రిటర్న్స్ లో రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ లభిస్తుంది.

5 /6

వచ్చే ఏడాది ప్రభుత్వం బేసిక్ శాలరీ పెంచిన తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్స్ గరిష్టంగా రూ. 15,000 బేసిక్ శాలరీపై లెక్కిస్తున్నారు. ఇది నెలకు రూ. 1,250కి కాంట్రిబ్యూషన్ ను పరిమితం చేస్తుంది. వేతన పరిమితి రూ. 21,000 పెంచితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ నెలకు రూ. 1,749 పెరుగుతుంది.

6 /6

ఇలా ఎక్కువ పెన్షన్ కార్పస్ క్రియేట్ అవుతుంది. నెలవారీ పెన్షన్ రూ. 10 వేలకు పైగా వస్తుంది. అయితే ఈపీఎస్ పెన్షన్ కు అర్హత పొందాలంటే మీరు తప్పనిసరిగా పదేళ్ల పాటు స్కీములో కాంట్రిబ్యూట్ చేయాలి. మీకు 58ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభం అవుతాయి.