Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.
Post Office Time Deposit: పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేస్తే గ్యారంటీ రిటర్న్ వస్తుంది. అంతేకాదు ఇందులో డబ్బులు కూడా ఇతర పెట్టుబడి సంస్థలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది కూడా. పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారో తెలుసుకుందాం.
పోస్ట్‌ఆఫీస్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఇందులో ఎక్కువ వడ్డీని పొందే అవకాశం కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా మీరు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
పోస్ట్ఆఫీస్ ఈ ఎఫ్డీ స్కీమ్‌లో ఎటువంటి ట్యాక్స్ కట్టింగ్ లేకుండా గ్యారంటీ ఎక్కువ వడ్డీ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి కొద్దిరోజుల్లో ఎక్కువ డబ్బు పొందే అవకాశం లభిస్తుంది. మీరు డబుల్ రిటర్న్ పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో ఏడాదికి 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్లకు 7 శాతం వడ్డీ, మూడేళ్లకు 7.1 శాతం వడ్డీ, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ స్కీమ్‌లో ఐదేళ్లకు 5 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో ఐదేళ్లకు డిపాజిట్ చేస్తే కచ్చితంగా మీరు రెట్టింపు డబ్బులు పొందుతారు. అది ఎలాగో తెలుసుకుందాం.
పోస్ట్ఆఫీస్ స్కీమ్‌లో మీరు రూ. 5 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ ఐదేళ్లపాటు చేస్తే దీనికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లకు రూ.2,24,974 వడ్డీ లభిస్తుంది. మొత్తం రూ. 7,24,974 అవుతుంది. ఈ డబ్బును మరో ఐదేళ్లపాటు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే ఆ వడ్డీరేటుతో రూ. 3,26,201 లభిస్తుంది. ఈ మొత్తం కలిపితే రూ 10,51,175 మెచ్యూరిటీ సమయానికి వస్తుంది.