Post Office Scheme 2025: కేవలం రూ.5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. అధిక వడ్డీతో నేరుగా మీ ఖాతాలోకి రూ.8 లక్షలు.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!

Post Office Scheme 2025: పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో భాగంగా రికరింగ్ డిపాజిట్ స్కీం లో పెట్టుబడి పెట్టే వారికి భారీ వడ్డీ లభించబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా మీరు పెట్టిన అమౌంట్ లో నుంచి ఏకంగా 50% వరకు రుణ సౌకర్యం పొందవచ్చు. 
 

Post Office Scheme 2025: ప్రతి ఒక్కరు వారు సంపాదిస్తున్న ఆదాయంలో ఎంతో కొంత భాగాన్ని ఖర్చు పెట్టుకోకుండా ఆదా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే డబ్బును సురక్షితంగా దాచి ఉంచేందుకు వివిధ బ్యాంకుల్లో, ఇతర పథకాల్లో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందులో భాగంగానే చిన్న పొదుపు పథకానికి ప్రత్యేకమైన ప్రజాధరణ లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పథకాల్లో ఒకటైన చిన్న పొదుపు పథకంలో రికరింగ్ డిపాజిట్ అనే ప్రత్యేకమైన ఆప్షన్ ఉంది. అయితే దీని ద్వారా ప్రతినెల కేవలం రూ. 5000 డిపాజిట్ చేసి.. అధిక వడ్డీతో ఏకంగా రూ.8 లక్షల కంటే ఎక్కువగానే పొందవచ్చు. అలాగే ఈ పెట్టుబడిలో భాగంగా ఏదైనా డబ్బులు అవసరం పడ్డప్పుడు పోస్ట్ ఆఫీస్ రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.   

2 /5

2023 సంవత్సరంలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా వడ్డీ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని ద్వారా ఇందులో పెట్టుబడి పెట్టిన చాలామంది భారీ మొత్తంలో లబ్ధి పొందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ కిమ్స్ లో భాగంగా వడ్డీ రేటు 6.7 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.   

3 /5

ఈ ప్రత్యేకమైన ఆర్ డి డిపాజిట్ పథకంలో భాగంగా పెట్టుబడి కేవలం ప్రతినెల రూ.5 వేలు పెడితే.. చివరకు రూ.8 లక్షల వరకు పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఈ స్కీం లో భాగంగా దాదాపు రూ. 3 లక్షల వరకు మెచ్యూరిటీ అమౌంటును అందిస్తోంది. అంటే దాదాపు ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు అదనంగా పొందవచ్చు.   

4 /5

ఈ పథకంలో భాగంగా కేవలం రూ.5000 పెట్టుబడి పెడితే దాదాపు 6.7% వరకు వడ్డీని పొందవచ్చు. అంటే ప్రతి ఏడాదికి రూ.56 వేల కంటే ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. కేవలం ఐదు సంవత్సరాల వరకు ఇలా ప్రతినెల రూ.5000 కట్టుకుంటూ పోతే.. వడ్డీతో కలిపి రూ. 8 లక్షల వరకు పొందవచ్చు.  

5 /5

ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో భాగంగా రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మీరు జమ చేసుకునే అమౌంట్ లో దాదాపు 50% వరకు రుణ సౌకర్యం పొందవచ్చు. ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి కేవలం మూడు సంవత్సరాల తర్వాత ప్రీ మెచ్యూర్ అమౌంట్ ని క్లోజ్ చేసుకునే సదుపాయం కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అనేక రకాల ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి.