Pawan Kalyan wifes: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇప్పుడు రాజకీయంగా కూడా దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న ఈయన గతంలో వైవాహిక బంధం కారణంగా వార్తల్లో నిలిచారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, స్వతహాగా పైకి ఎదిగారు అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో మాస్ హీరోగా ప్రేక్షకులలో పేరు దక్కించుకున్న ఈయన సినిమాలకంటే కూడా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
ముఖ్యంగా మూడు వివాహాలు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఎక్కువ వివాహాలు చేసుకున్న సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ పబ్లిక్ ఫిగర్ కావడంతో ఈయన పైన చాలామంది విమర్శలు గుప్పించారు. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు.. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై చాలా మంది కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవిత విషయానికి వస్తే.. నందిని రెడ్డి ని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు. ఆమెతో సహజీవనం చేసి ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత కొడుకు సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక కూతురు ఆధ్యా పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత 2013లో రష్యా నటి అన్నా లెజ్ నోవా ను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్,అన్నా లెజ్ నోవా మధ్య తేడా ఇదే అంటూ ఒక ఫోటో చాలా వైరల్ గా మారుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. రేణు దేశాయ్ వయసు 42 సంవత్సరాలు కాగా.. అన్నా లెజ్ నోవా వయసు 44 సంవత్సరాలు. రేణు దేశాయ్ ఆస్తి విలువ రూ.300 కోట్లు కాగా..అన్నా లెజ్ నోవా ఆస్తి విలువ సుమారుగా రూ.1800 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అలాగే రేణు దేశాయ్ ప్రొఫెషన్ విషయానికొస్తే.. నటి గా, డిజైనర్ గా పేరు దక్కించుకుంది.. అన్నా లెజ్ నోవా నటిగా, మోడల్గా పేరు సొంతం చేసుకుంది. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎంబీఏ పట్టా అందుకుంది.అన్నా లెజ్ నోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. రేణు దేశాయ్ మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందినవారు కాగా..అన్నా లెజ్ నోవా రష్యా కు చెందినవారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి రెండవ మాజీ భార్య..అన్నా లెజ్ నోవా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్యగా కొనసాగుతున్నారు.