Latest New Business Idea: కాసులు కురిపించే అదిరిపోయే బిజినెస్‌.. నెలకు రూ.80,000 మీ సొంతం..

New Daycare Business Idea: నేటి కాలంలో వ్యాపారాలు చేయడం అనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయంగా మారింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి  తక్కువ పెట్టుబడి సరిపోతుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలను నడపడానికి అధిక నైపుణ్యాలు అవసరం లేదు. అయితే మార్కెట్‌లో చాలా మంది చిన్న వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ సొంతం నైపుణాలతో మార్కెట్‌ మీద అవగహన ఉండే కాసులు వర్షం కురుస్తుంది. చాలా మంది మహిళలు, యువత ఈ వ్యాపారాల వైపు మక్కువ చూపుతున్నారు. మీరు కూడా సొంతంగా బిజిజెస్‌ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం ..
 

1 /10

బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు. అది ఒకరి కష్టానికి, ప్రతిభకు ఒక వేదిక లాంటిది. బిజినెస్‌తో ఒక వ్యక్తి తన కలలను సాకారం చేసుకోవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు,  తనను తాను నిరూపించుకోవచ్చు. ఇది ఒక వ్యక్తిని ఆత్మవిశ్వాసంతో నింపి, అతనిని మరింత ఎదగడానికి ప్రేరేపిస్తుందని బిజినెస్‌ నిపుణులు చెబుతున్నారు. 

2 /10

బిజినెస్ చేయడానికి ముఖ్య కారణం ఇందులో స్వంత బాస్‌గా ఉండవచ్చు. సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి, భవిష్యత్తు కోసం ఆదా చేయడానికి తగినంత డబ్బు సంపాదించవచ్చు. అయితే మీరు కూడా మీ ప్రతిభను నిరూపించుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడు తెలుసుకొనే బిజినెస్‌ మీకు ఎంతో లాభదాయకం. 

3 /10

నేటి తరంలో ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్న ఇళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు, పిల్లలను పెంచడం, వాటిని చూసుకోవడం కూడా కష్టమే అవుతుంది. ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్న ఇంటిలో, ప్రతి ఒక్కరికి వారి వారి పనులు, బాధ్యతలు ఉంటాయి. దీంతో పిల్లల కోసం సరిపడా సమయం కేటాయించడం కష్టమే.  

4 /10

ఉద్యోగంలో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, పిల్లలను చూసుకోవడం కొంత మందికి భారంగా అనిపించవచ్చు. ఈ అవసరం నుంచి మీరు ఒక అద్భుతమైన వ్యాపార ప్రారంభించుకోవచ్చు.ఎలా అంటే డే కేర్‌ సెంటర్ బిజినెస్‌తో సాధ్యం అవుతుంది. 

5 /10

పిల్లలు పెరుగుతున్న కొద్దీ, చైల్డ్‌కేర్ సేవలకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ బిజినెస్‌తో పిల్లలతో గడుపుతున్న సమయం చాలా సంతృప్తినిస్తుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఈ బిజినెస్‌ను ఇంటి నుంచి లేదా పెద్ద షాపును తెరవచ్చు.   

6 /10

డే కేర్ బిజినెస్ అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, ఇది పిల్లల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే బాధ్యత కూడా. పిల్లలతో సమయం గడపడం, వారిని అర్థం చేసుకోవడం, వారి అవసరాలను గుర్తించడం - ఇవన్నీ డే కేర్ ప్రొవైడర్‌గా మీ విజయానికి కీలకం. ఈ బిజినెస్‌ చేసే ముందు మీరు ఈ విషయాలను గుర్తించుకోవాలి. 

7 /10

 డే కేర్‌ బిజినెస్‌ను ప్రారంభించడానికి మీకు కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షలు పడుతుంది. ఈ డబ్బుతో పిల్లలకు ఆటవస్తువులు, పడకలు, కుర్చీలు, పట్టికలు, బొమ్మలు, పుస్తకాలు, ఆహారం తయారు చేయడానికి అవసరమైన పాత్రలు, వంటసామాగ్రి, శుభ్రపరచడానికి అవసరమైన సామాగ్రి మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.

8 /10

మీ వద్ద పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర పథకం కింద పెట్టుబడికి కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చు. లేదా మీరు మీ ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా మీరు డే కేర్‌ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. 

9 /10

డే కేర్ సెంటర్‌ను నడపడానికి అవసరమైన అన్ని లైసెన్స్‌లు, పర్మిట్లు పొందడానికి అయ్యే ఖర్చు ముందుగానే తీసుకోవడం ముఖ్యం. అలాగే మీ డే కేర్ సెంటర్ గురించి ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రచార ఖర్చు కూడా చేసుకోవాలి. డే కేర్ సెంటర్‌కు బీమా చేయించుకోవడం మంచిది.

10 /10

డే కేర్‌ బిజినెస్‌ ఐడియాతో మీరు నెలకు రూ. 20 వేల నుంచి రూ. 80 వేల వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌తో మీరు డబ్బు సంపాదించడంతో పాటు పిల్లలలో క్రమశిక్షను నింపువచ్చు. వారితో అనందంగా సమయం గడపవచ్చు. ఈ ఐడియా మీకు కూడా నచ్చుతే మీరు కూడా ట్రై చేయండి.