New Job Recruitment 2025 Notification: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఖాళీ ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
New Job Recruitment 2025 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వ అడుగుజాడల్లో సేవలు అందిస్తున్న టాటా మెమోరియల్ సెంటర్‌కు సంబంధించిన హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో వివిధ భాగాల్లో కాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రీసెర్చ్ సెంటర్లో ఉన్న మొత్తం 38 కాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో కాళీ ఉన్న 38 పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 10వ తేదీ లోపు దీనిని అప్లై చేసుకునే వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తారు.
ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుస్తోంది. ఇందులోని మొత్తం పోస్టుల సంఖ్య 38 కాగా వీటిని భర్తీ చేయనున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ లో పోస్టులకు సంబంధించిన పేర్లను కూడా వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్లో భాగంగా మొదటగా అసిస్టెంట్ మెడికల్ తోపాటు అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఇందులో భాగంగానే మెడికల్ ఫిజిసిస్ట్, ఆఫీస్ ఇంచార్జ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లు తెలిపారు. ఇవే కాకుండా ఇతర పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా విద్యార్హతలను కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే టెన్త్ నుంచి పీహెచ్డీ చేసిన వారు ఎవరైనా ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ ఖాళీలకు సంబంధించిన పోస్టులను అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, DM / DNB వంటి ప్రత్యేకమైన విద్యా అర్హతలను పేర్కొన్నారు.
ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే ఈ పోస్టులకు జీతం కూడా భారీ మొత్తంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వారీగా జీతం అందించబోతున్నట్లు నోటిఫికేషన్లో క్లుప్తంగా పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక వివరాల్లోకి వెళితే.. అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా లేదా ఇంటర్వ్యూ ద్వారా తీసుకోబోతున్నట్లు సమాచారం.