NBK Legend Movie 10 Years Celebrations: గ్రాండ్‌గా బాలకృష్ణ 'లెజెండ్' 10 ఇయర్స్ సెలబ్రేషన్స్.. సాధించిన రికార్డులు ఇవే..

NBK Legend Movie 10 Years Celebrations: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. సింహా తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'లెజెండ్' మూవీ తాజాగా 10 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

1 /6

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన రెండో మూవీ 'లెజెండ్'. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఈ గురువారంతో దశాబ్దాం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

2 /6

అంతేకాదు అప్పట్లో లెజెండ్ సినిమా ఘన విజయం తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో గెలుపుకు ఓ ఊపు తీసుకొచ్చింది. సింహా తర్వాత సరైన సక్సెస్‌లేని బాలయ్యకు మళ్లీ లెజెండ్ మూవీతో మళ్లీ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

3 /6

లెజెండ్ మూవీ బాలయ్య కెరీర్‌లోనే తొలి రూ. 40 కోట్ల షేర్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు బాలయ్య వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేకులు వేసింది.

4 /6

అంతేకాదు డిజిటల్ యుగంలో ఈ సినిమా దాదాపు 1000 రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా లెజెండ్ తన పేరిట మరో రికార్డును రాసుకుంది.

5 /6

లెజెండ్ మూవీ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'తో ఘన విజయం సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్ హిట్‌గా నిలిచింది. ఇపుడు అదే ఊపులో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ 2' రాబోతుంది.

6 /6

లెజెండ్ సినిమా రిలీజై 10 యేళ్లు పూర్తైన సందర్బంగా ఈ సినిమాను మళ్లీ గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్‌లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.