Lowest Personal Loan Rates: సాధారణంగా ఏ లోన్స్ కావాలన్నా మనం బ్యాంకుకు వెళ్తాం. అవి మనం తీసుకున్న మొత్తం పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎక్కువ శాతం బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అది కూడా ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అన్ని బ్యాంకులు 10.50% నుండి 24% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే అతి తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులు జాబితా తెలుసుకుందాం.
Lowest Personal Loan Rates: కొన్ని ఆర్థిక సమస్యల వల్ల బ్యాంకులో మనం పర్సనల్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, కారు కొనుగోలు చేయాలనుకున్నా, ఇల్లు కొనాలన్నా, ఎడ్యుకేషన్ కోసం మనం బ్యాంకు నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. అయితే పర్సనల్ లోన్ పైన ఎక్కువ శాతం వడ్డీలను వసూలు చేస్తాయి. ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఇది అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అని అందరికీ తెలిసిందే. ఈ బ్యాంకులో మీరు పర్సనల్ లోనికి అప్లై చేస్తే 10.5 నుంచి 24% వరకు వడ్డీ రేట్లపై రుణం అందిస్తాయి. ఇందులో రూ. 5000 వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
ఐసిఐసిఐ బ్యాంక్.. ఇది ప్రైవేట్ సెక్టార్ లోని రెండో అతిపెద్ద రంగా బ్యాంకు. ఇందులో పర్సనల్ లోన్ కి 10.65% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న మొత్తాన్ని బట్టి ఇతర టాక్స్ లు కూడా ఉంటాయి.
ఎస్బిఐ.. ఇది అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఇందులో 12.30 శాతం నుంచి 14.30% వరకు వసూలు చేస్తాయి. అయితే గవర్నమెంట్ ప్రభుత్వంగా ఎంప్లాయిస్ నుంచి 11.30% నుంచి 13.80 శాతం వరకు వడ్డీనిలకు వసూలు చేస్తాయి. డిఫెన్స్ వారికి 11.15 నుంచి 12.65% వరకు ఏడాదికి పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఇందులో పర్సనల్ లోన్ పై 13.15 నుంచి 16.75% వరకు వడ్డీలు వసూలు చేస్తుంది ఇక ప్రభుత్వం గా ఎంప్లాయిస్ కి అయితే 12.40% నుంచి 16.75% వరకు అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంకులో వడ్డీలు 13.75% నుంచి 17.25% వరకు ఆ వ్యక్తి తీసుకున్న మొత్తాన్ని మీద ఆధారపడి క్రెడిట్ స్కోర్ తో లింక్ చేసి వసూలు చేస్తారు. ప్రభుత్వ జాబ్ ఉన్నవారికి 12.75 నుంచి 15.25% వరకు వసూలు చేస్తారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్.. ఈ బ్యాంకులో 10.99% వరకు పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తుంది దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు ఇతర టాక్స్ డబ్బులు వసూలు చేస్తుంది.
యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే వారికి 10.65% నుంచి 22% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్.. ఇండస్ఇండ్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే వారికి 10. 49 శాతం వరకు ఏడాదికి వడ్డీ రేటును వసూలు చేస్తుంది దీనికి ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజు 3% వసూలు చేస్తుంది ఇందులో 30,000 నుంచి 50 లక్షల వరకు రుణం పొందవచ్చు.
కరూర్ వైశ్యా బ్యాంక్.. ఈ బ్యాంకులో 11%, 13% ఏడాదికి పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తాయి ఇది 2023 డిసెంబర్ 31 నుంచి అమల్లో ఉంది.
ఎస్ బ్యాంక్.. ఎస్ బ్యాంకులో పర్సనల్ లోన్ పై వడ్డీ రేట్లు 10.49% నుంచి ప్రారంభం అవుతుంది. 72 నెలల వరకు గడువు ఉంటుంది 50 లక్షల వరకు రుణమాందిస్తారు