Liquor shops: మందు బాబులకు బిగ్ షాక్.. పాపం.. పెద్ద కష్టమే వచ్చిపడిందిగా.. అసలు విషయం ఏంటంటే..?

Liquor Shortage in andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా మద్యం షాపు టెండర్ల విషయంలో కూడా ఎక్కడ అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో ఆబ్కారీ లాటరీ విధానంలో లిక్కర్ షాపుల్ని కేటాయించిన విషయం తెలిసిందే.

1 /6

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో కూటమి వినూత్నంగా ప్రచారం నిర్వహించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన  మద్యం.. తక్కువ ధరకే మందుబాబులకు అందేలా చూస్తామని కూడా ప్రచారం నిర్వహించింది. 

2 /6

దీనిలో భాగంగా కూటమి అధికారంలోకి రాగానే దాని మీద చర్యలు కూడా చేపట్టింది. ఏపీ ప్రజలకు రూ. 99 కే మద్యం బ్రాండ్లను కూడా తీసుకొచ్చింది. అయితే.. తాజాగా.. ఏపీలో లిక్కర్ షాపులను కేటాయించిన తర్వాత కొన్ని బ్రాండ్లు మాత్రం తరచుగా కొరత ఏర్పడుతుందంట.  

3 /6

ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టిన కూడా.. బీర్ల కొరత ఏర్పడుతుందంట.  డిమాండ్ కు సరిపడా సప్లైలేక పోవడంతో మందుబాబులు తెగ టెన్షన్ పడుతున్నారంట.   బీర్లను 10 కేసులు ఆర్డర్ పెడితే.. కనీసం ఒక్క కేసు కూడా వచ్చే పరిస్థితి కన్పించడంలేదని.. వైన్ షాపుల నిర్వహకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట. 

4 /6

ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుందని విషయం తెలిసిందే. అయితే మందుబాబులకు లిక్కర్ కొరత ఇప్పట్లో తీరేలా కన్పించడంలేదని చెప్పుకొవచ్చు.  

5 /6

ముఖ్యంగా..  ఇంపీరియల్‌ బ్లూ, మెక్‌ డోవెల్స్‌ , కింగ్ ఫిషన్ వంటి లిక్కర్ బాటిళ్లపై కొరత ఏర్పడిందంట. ఆర్డర్ పెట్టిన కూడా రోజుల తరబడి వేచీ చూస్తున్న సప్లై ఉండటం లేదంట. దీంతో మందుబాబులు మాత్రం తీవ్ర ఆవేదనకు లోనౌతున్నారంట.  

6 /6

మరోవైపు ఏపీ సర్కారు మాత్రం...లిక్కర్ షాపులు ఎమ్మార్పీని మించి అమ్మితే  రూ.5లక్షలు జరిమానా విధించాలని ఆదేశించింది. మళ్లీ తప్పులు చేస్తే.. మద్యం షాపుల లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. బెల్ట్‌ షాపుల విషయలో ఏపీ సర్కారు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తొంది.