Spongy Pancake Recipe: రాత్రి అన్నంతో ప్యాన్‌కేక్.. ఒక్కసారి తింటే రోజు కావాలంటారు!

Spongy Pancakes With Left Over Rice: సాధారణంగా రాత్రి అన్నంను చాలా మంది బయట పడేస్తుంటారు. కానీ మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన స్పాంజీ ప్యాన్‌కేక్స్ చేయవచ్చని మీకు తెలుసా? ఈ రెసిపీ చాలా సులభం, తక్కువ సమయంలో రెడీ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఆహారం వృథాకాకుండా ఉంటుంది.

1 /9

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వృథా చేయడం చాలా పాపం. అది కేవలం ఆహారం వృథా చేయడమే కాదు, మనం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా వృథా అయినట్టే. కానీ మిగిలిపోయిన అన్నంతో ఎన్నో రకాల రుచికరమైన ఆహారాలు చేసుకోవచ్చు.

2 /9

చాలా మంది మిగిలిపోయిన అన్నంతో పులిహోర తయారు చేసుకుంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లాంచ్‌కు కూడా ఎంతో మంచి ఎంపిక. అయితే ఎప్పుడు పులిహోర కాకుండా ప్యాన్‌ కేక్‌ కూడా తయారు చేసుకోవచ్చు.

3 /9

మిగిలిపోయిన అన్నంతో ప్యాన్‌కేక్స్ చేయడం చాలా సులభం. ఇందులో కూరగాయలు, చీజ్, పనీర్ వంటివి కలిపి రుచిని మరింత పెంచుకోవచ్చు. దీని ఆరోగ్యకరమైనది అలాగే రుచికరమైనది కూడా. 

4 /9

మిగిలిపోయిన అన్నంతో ప్యాన్‌కేక్స్ ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. 

5 /9

కావాల్సిన పదార్థాలు: మిగిలిపోయిన అన్నం - 1 కప్పు, గుడ్లు - 2, పాలు - 1/2 కప్పు, మైదా లేదా గోధుమ పిండి - 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయడానికి

6 /9

మిగిలిపోయిన అన్నాన్ని ఫోర్క్ లేదా మిక్సీలో మెత్తగా చేయండి. అన్నం చాలా పొడిగా ఉంటే, కొంచెం పాలు లేదా నీరు కలిపి మెత్తగా చేయండి.

7 /9

ఒక బౌల్‌లో గుడ్లు, పాలు, పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి. ఆ తర్వాత మెత్తగా చేసిన అన్నాన్ని కలిపి మృదువైన మిశ్రమాన్ని తయారు చేయండి.

8 /9

నాన్ స్టిక్ పాన్ తీసుకొని కాల్చండి. పాన్ కాగానే కొంచెం నూనె వేసి, మిశ్రమం నుంచి కొంచెం తీసుకొని వేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

9 /9

వేడి వేడి ప్యాన్‌కేక్స్‌ను జామ్, బటర్, మిరపకాయ సాస్ లేదా మీ ఇష్టమైన టాపింగ్స్‌తో సర్వ్ చేయండి.