Vastu Tips: ఈశాన్య దిశలో ఈ ఒక్క వస్తువు పెట్టారంటే.. మీ ఇంట సిరులపంటే..

Vastu Tips For Money: వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు నిర్ధేశించిన దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం నలుదిక్కులను అనుసరించి వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ఈశాన్య దిశలో ఒక్క వస్తువును ఏర్పాటు చేసుకుంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
 

1 /5

వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దిశలో శంఖం ఏర్పాటు చేసుకుంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. శంఖం అంటే విష్ణువుకు ప్రతీక ఈ దిశలో పెట్టుకుంటే ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి.  

2 /5

సాధారణంగా ఈశాన్య దిశలో పూజగది ఏర్పాటు చేసుకుంటారు. ఈ దిశలో ఏర్పాటు చేసుకుంటారని పండితులు చెబుతారు. అయితే, అక్కడే శంఖం కూడా ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో సుకఃశాంతులు పొందుతారు. ఇది మనకు మేధస్సును కూడా అందిస్తుంది.  

3 /5

అంతేకాదు వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని అంటారు. ఎందుకంటే ఈ దిశలో పూజలు చేస్తాం కాబట్టి అంతేకాదు ఈ దిశ ఎప్పుడూ తడిగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి.  

4 /5

ఈశాన్య దిశలో శంఖం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో నెగిటివిటీ తగ్గిపోయి, సానుకూల శక్తి వస్తుంది. శంఖాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.  

5 /5

ముఖ్యంగా ఈశాన్య దిశ అంటేనే సంపదకు చిహ్నం. ఈ దిశలో ఏర్పాటు చేసిన శంఖం ఊదడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)