Kajal Agarwal Instagram pics: సత్యభామ సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది కాజల్. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయమైన.. ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే అందరిని ఫిదా చేసింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో మరింత చేరువయ్యింది. రాజమౌళి మగధీర చిత్రంతో ఏకంగా బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇక ఆ తర్వాత కాజల్ కి తెలుగులో తిరుగులేకుండా పోయింది. అయితే తన కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే.. పెళ్లి చేసుకొని అందరిని షాక్ కి గురి చేసింది.
ఇక ఈ మధ్యనే ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ సినిమాలకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ప్రస్తుతం సత్యభామ సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి.