Jobs Notification 2025: నిరుద్యోగ యువకు ఆంధ్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. 19 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు అదిరిపోయే శుభవార్త.. వివిధ రంగాల్లో కాళీ ఉన్న 19 రకాల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో భాగంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలతో పాటు అన్ని వివరాలను క్లప్తంగా వెల్లడించారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ 19 రకాల ఉద్యోగాలకు సంబంధించిన ప్రత్యేకమైన నోటిఫికేషన్ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా పదవ తరగతి నుంచి డిగ్రీ చేసినవారై ఉండాలి. అంతేకాకుండా వివిధ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నోటిఫికేషన్లో భాగంగా చివరి తేదిని కూడా వెల్లడించింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా ఫిబ్రవరి 22వ తేదీలోపు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి మార్చి 24వ తేదిన నియామక పత్రాలు అందించబోతున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీతో పాటు శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇతర సంస్థల్లో ఖాళీ ఉన్న పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థల్లో ఉన్న మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలలో ల్యాబ్ అటెండెంట్ నుంచి మొదలకొని.. మార్చరీ మెకానిక్ పోస్టుల వరకు 19 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా ఈ పోస్టుల్లో పదవ తరగతికి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇందులో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ప్రత్యేకమైన పోస్టులు ఉన్నాయి.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 22వ తేదీలోపు పోస్టులకు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రూ.300 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.