Jio Cheapest Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్ మధ్య గట్టి పోటీ కూడా నడుస్తుంది. అయితే, జియో తన కస్టమర్ల కోసం మరో రీఛార్జీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో మీరు బంపర్ బెనిఫిట్స్ పొందుతారు..
మీరు కూడా జియో కస్టమర్ అయితే.. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీఛార్జీ ప్యాక్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్యాక్ మీకు బెస్ట్. ఇందులో అదనపు ఖర్చు లేకుండా ఓటీటీలు కూడా ఉచితంగా పొందుతారు. ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా ఫ్రీ.
ఈ రీఛార్జీ ప్యాక్ ధర రూ.445 మాత్రమే. అంతేకాదు ఈ ప్లాన్ ధర ఇటీవలె రూ.3 కూడా తగ్గించారు. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. జియో ఈ అతి తక్కువ ధర ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు వస్తుంది ఇందులో 2 జీబీ డేటా 5 జీ పొందుతారు. ఈ ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు.
అంతేకాదు ఈ ప్లాన్‌లో మీరు ఎలాంటి ఖర్చు లేకుండా 13 ఓటీటీలు కూడా అదనంగా మీ సొంతం. జియో సినిమా ప్రీమియం. లాయన్స్గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, జియోటవీ, సోనీ లైవ్, జీ5 కూడా పొందుతారు.
రిలయన్స్ జియో అందిస్తున్న మరో బంపర్ ప్లాన్ రూ.449. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులపాటు వర్తిస్తుంది. కానీ, ఇందులో 3 జీబీ డేటా డైలీ బెనిఫిట్స్ కూడా . 5 జీ డేటా అపరిమితంగా అర్హత గల కస్టమర్లు పొందుతారు.
ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయిన పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా జియో కస్టమర్లు జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత యాక్సెస్ కూడా మీ సొంతం.
జియో రూ.448, రూ.1748 వాయిస్ ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఈ ప్యాక్‌లో రూ.448 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు వర్తిస్తుంది. రూ.1748 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో వెయ్యి ఎస్ఎంఎస్లు ఫ్రీ గా పొందుతారు. రూ.1748 లో 3600 ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు. ఈ ప్లాన్స్‌లో కూడా జియో సినిమా, జియో టీవీ యాక్సెస్ పొందుతారు.