Cricket Records: టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు ఇవే.. యూవీ రికార్డు పదిలం..!

Fastest Fifties In T20 Cricket: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. దీంతో మరోసారి టీ20 అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల గురించి చర్చ మొదలైంది. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువగా వచ్చాడు యశస్వి. టీ20 వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేసిన వీరులు ఎవరంటే..? 
 

1 /5

కేకేఆర్‌పై కేవల 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా వేసిన తొలి ఓవర్‌లోనే ఏకంగా 26 పరుగులు చేశాడు.   

2 /5

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఇప్పటికీ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌పైనే ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.  

3 /5

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ కూడా టీ20ల్లో అత్యంత వేగంగా 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. బిగ్ బాష్ లీగ్ 2016లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున క్రిస్ గేల్ ఈ ఫీట్‌ను సాధించాడు.  

4 /5

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022లో చటోగ్రామ్ ఛాలెంజర్స్‌పై కొమిల్లా విక్టోరియన్స్ తరపున సునీల్ నరైన్  13 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.    

5 /5

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో 2018లో బాల్ఖ్ లెజెండ్స్‌పై రికార్డు స్థాయిలో 12 బంతుల్లో ఫిఫ్టీని కొట్టాడు.