Hair Fall: కేవలం ఈ 2 చాలు.. జుట్టు అస్సలు ప‌ట్టుకుని లాగినా ఊడదు..!

Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్‌, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్‌ కేర్‌ రొటీన్‌ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్‌ టిప్స్‌ మీకోసం..
 

1 /7

జుట్టు రాలే సమస్యకు మనం తీసుకునే కొన్ని చర్యలు కూడా ప్రధాన కారణం. హెయిర్‌ కేర్‌ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  

2 /7

ముఖ్యంగా మన డైట్‌లో విటమిన్స్‌, మినరల్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలకుండా ఉండాలంటే ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. వారానికి కనీసం రెండు సార్లు కొబ్బరి నూనె పెట్టాలి.  

3 /7

తలస్నానం ప్రతి వారంలో రెండు మూడు సార్లు చేసుకోవాలి. కొంతమంది వేడివేడి నీటితో తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టులో డ్యాండ్రఫ్ పేరుకుంటుంది. జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అందుకే కేవలం చల్ల నీటితో తలస్నానం చేయాలి.  

4 /7

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు మన డైట్లో ఉండాలి. ప్రోటీన్‌ శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు ఊడటంలో ప్రోటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. నట్స్‌, విత్తనాలు మన డైట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  

5 /7

దీంతో జుట్టు ఊడకుండా ఉంటుంది. ప్రతి వారంలో కనీసం రెండుసార్లు అయినా ఆకుకూరలు తినాలి. ఇందులో ఉండే విటమిన్స్‌ జుట్టును కుదుళ్ల నుంచి దృఢ పరుస్తాయి. జుట్టు ఊడకుండా బలంగా మారుతుంది.  

6 /7

మీ జుట్టు ఊడకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకుని అప్లై చేయాలి. దీంతో జుట్టు సహజసిద్ధంగా మెరుస్తుంది. జుట్టు ఊడమన్నా ఊడదు.  

7 /7

అయితే, వీటిన్నింటినీ పాటించినా జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టలేకపోతున్నారా? అయితే, వెంటనే వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే దీనికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం కావచ్చు.