Liver Health Foods: ఫ్యాటీ లివర్ సహా ఇతర లివర్ వ్యాధులకు చెక్ చెప్పాలంటే మీ డైట్ ఇలా ఉండాలి

Liver Health Foods: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ కీలకమైంది. లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. మానవ శరీరంలో లివర్ పని తీరు చాలా వైవిద్యమైంది. ఆహారం జీర్ణం నుంచి ఇమ్యూనిటీ వరకూ చాలా పనులు నిర్వహిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలోని విష పదార్ధాలను, వ్యర్ధాల్ని బయటకు తొలగిస్తుంది.

Liver Health Foods: అందుకే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని పండ్లు, కూరగాయలు డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. 
 

1 /4

పండ్లు కూరగాయలతో పాటు తృణ ధాన్యాలు వారంలో కనీసం 3-4 సార్లు తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవాళ్టి నుంచే మీ డైట్ మార్చుకోండి

2 /4

రోజూ ద్రాక్ష తింటే లివర్ స్వెల్లింగ్ తగ్గుతుంది. అంతేకాకుండా డీటాక్సిఫికేషన్ కూడా బాగుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతాయి. వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది. దీనికోసం డైట్‌లో క్యారట్, బ్రోకలీ, ఆపిల్, ద్రాక్ష, బెర్రీస్ , పాలకూర తప్పనిసరిగా తినాలి

3 /4

లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు డైట్‌లో నట్స్, సీడ్స్ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇవి హెల్తీ ఫ్యాట్‌ను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ివర్ స్వెల్లింగ్ తగ్గుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను అద్భుతంగా తగ్గిస్తుంది.

4 /4

పండ్లు కూరగాయలతో పాటు తృణ ధాన్యాలు వారంలో కనీసం 3-4 సార్లు తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవాళ్టి నుంచే మీ డైట్ మార్చుకోండి