Vasant Panchami 2025: అక్షరాభ్యాసం చేసే విధానం.. వసంత పంచమి రోజు ఇలా చెయ్యడం తప్పనిసరి..

Akshara Abhyasam Timings on Vasanth Panchami : ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరసటి రోజు అనగా ఫిబ్రవరి 3 ఉదయం 6:35 నిమిషాల వరకు ఉండనుంది. ఈ సమయంలో సరస్వతి దేవిని పూజించడం ఎంతో శుభప్రదమైనది. విద్యార్ధులు, పిల్లలు, టీచర్లు, అందరూ ఈ రోజు సరస్వతి పూజ చేసి తమ విద్యార్థి జీవితంలో విజయాలు సాధించాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఎంతోమంది అక్షరాభ్యాసం చేయిస్తారు 
 

1 /6

అక్షరాభ్యాసం చేయించేవారు ముందుగా బాబు లేదా పాపకు తలస్నానం చేయించి, కొత్త బట్టలు వెయ్యాలి. వారి దగ్గర పూజ మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కారం చేయించి, ఆ తర్వాత వినాయకుడు పూజ, సరస్వతీ పూజ చేయాలి. 

2 /6

ఒక పళ్లెంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి, రెండు గీతలు గీయించి, పై భాగంలో "ఓం" అని, రెండవ భాగంలో "నమశ్శివాయ" అని, మూడవ భాగంలో "సిద్ధం నమః" అని మూడు పర్యాయములు పురహితుడు బాబు లేదా పాప చేత రాయిస్తారు. 

3 /6

ఆ తర్వాత వినాయకుడు, సరస్వతి శ్లోకాలను పఠించాలి. ఇంట్లో ఉన్న పెద్దలు చేత బాబును ఒళ్ళో కూర్చోబెట్టి, పలక మీద 'ఓం నమశ్శివాయ' అని రాయించి, తరువాత అక్షరాలు రాసి దిద్దించాలి.   

4 /6

పఠనాన్ని పూర్తిగా చేసిన తర్వాత, 5 లేక 9 మంది పిల్లలకు.. పలక, బలపం, ఎక్కాల పుస్తకం వంటివి పంచిపడితే ఎంతో ఉత్తమం. 

5 /6

అలానే పూజ మొత్తం పూర్తయిన తర్వాత.. వేయించిన శనగపప్పు, మరమరాలు, బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి. ఇవన్నీ చెయ్యడం ద్వారా పిల్లలకు సరస్వతి దేవి అనుగ్రహం ముందటమే కాకుండా.. వాళ్లు చదువు పరంగా ఉన్నత స్థాయిలో ఉంటారు అని నమ్మకం.

6 /6

ఈ కథనంలో అందించిన సమాచారం, సూచనలు నిజమైనవి, ఖచ్చితమైనవి అని చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వాటిని పాటించే ముందు సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.